Battula Prabhakar Escape: క్యాచ్ హిమ్.. పోలీసులకు కీలక ఆదేశాలు..
ABN , Publish Date - Sep 23 , 2025 | 11:20 AM
బత్తుల ప్రభాకర్‌ను పట్టుకోవడానికి పోలీసులకు కమిషనర్ రాజశేఖర బాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏ.ఆర్.ఏ.డి.సి.పి. కుంబా కోటేశ్వర రావు నేతృత్వంలో బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అమరావతి: పోలీస్ కస్టడీ నుంచి మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ తప్పించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులకు నగర పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముద్దాయి ఆచూకీ కోసం మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్కార్ట్ విధులు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. రిమాండ్ ముద్దాయి తప్పించుకోవడానికి కారణం అయిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.
బత్తుల ప్రభాకర్‌ను పట్టుకోవడానికి ఏ.ఆర్.ఏ.డి.సి.పి. కుంబా కోటేశ్వర రావు నేతృత్వంలో బృందాలను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ రాజశేఖర బాబు తెలిపారు. ముద్దాయి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు చుట్టుపక్కల జిల్లాలు అయిన కృష్ణా, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితులలో ముద్దాయిని పట్టుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తుండగా దుద్దుకూరు దగ్గర బత్తుల ప్రభాకర్ పరారయ్యాడు. దుద్దుకూరు దాబా దగ్గర భోజనం కోసం ఆగిన సమయంలో పోలీసుల కళ్లు కప్పి ప్రభాకర్ తప్పించుకున్నాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ
ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు