Share News

Shankha Brata Bagchi ON Recovery Drive: రికవరీ మేళా.. రూ.1.21 కోట్ల విలువైన చోరీ సొత్తు రికవరీ

ABN , Publish Date - Sep 23 , 2025 | 08:10 PM

విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆగస్టు నెల రికవరీ మేళా జరిగింది. ఈ క్రమంలో రికవరీ మేళా వివరాలను విశాఖ సీపీ శంఖ బ్రాత బాగ్చి వెల్లడించారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆగస్టు నెలలో 75 చోరీ కేసులను ఛేదించామని సీపీ శంఖ బ్రాత బాగ్చి తెలిపారు.

Shankha Brata Bagchi ON Recovery Drive: రికవరీ మేళా.. రూ.1.21 కోట్ల విలువైన చోరీ సొత్తు రికవరీ
Shankha Brata Bagchi ON Recovery Drive

విశాఖపట్నం, సెప్టెంబరు23 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ (Visakhapatnam Police Commissionerate) పరిధిలో ఆగస్టు (August) నెల రికవరీ మేళా జరిగింది. ఈ క్రమంలో రికవరీ మేళా వివరాలను విశాఖ సీపీ శంఖ బ్రాత బాగ్చి (Shankha Brata Bagchi) ఇవాళ (మంగళవారం) వెల్లడించారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆగస్టు నెలలో 75 చోరీ కేసుల (Theft Cases)ను ఛేదించామని తెలిపారు. 75 కేసుల్లో 103మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు సీపీ శంఖబ్రాత బాగ్చి.


ఆగస్టు నెలలో రూ.1.21 కోట్ల విలువగల సొత్తును , మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించామని చెప్పుకొచ్చారు. 557.3 గ్రాముల బంగారం, రూ. 5.70 లక్షల నగదు, 18 ద్విచక్ర వాహనాలు రికవరీ చేశామని వివరించారు. ఆగస్టు నెలలో రూ. 57 లక్షల విలువ గల 423 మొబైల్ ఫోన్లు రికవరీ చేశామని వెల్లడించారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతి నెల రికవరీ పెరుగుతూ వస్తోందని చెప్పుకొచ్చారు సీపీ శంఖబ్రాత బాగ్చి.


చోరీ కేసులను చేధించడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న క్రైమ్ పోలీసులకు అభినందనలు తెలిపారు. విశాఖపట్నంలో ఒక రోజులో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించామని వెల్లడించారు. నిందితులు ఇతర రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించామని అన్నారు. నిందితుల కోసం ఆ రాష్ట్రానికి పోలీస్ టీమ్స్‌ను పంపించామని విశాఖ సీపీ శంఖ బ్రాత బాగ్చి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

అది నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం: మంత్రి లోకేష్

మీ వాదనలో నిజం ఉంటే సభకు రా.. జగన్‌కు మంత్రి సవాల్

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Sep 23 , 2025 | 08:14 PM