Criminal Bathula Prabhakar Escapes: పోలీస్ కస్టడీ నుంచి మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ పరారీ
ABN , Publish Date - Sep 22 , 2025 | 10:03 PM
పోలీస్ కస్టడీ నుంచి మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ పరారీ అయ్యాడు. విజయవాడ కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తుండగా దుద్దుకూరు దగ్గర బత్తుల ప్రభాకర్ పరారయ్యాడు.
రాజమండ్రి, సెప్టెంబర్ 22 (ఆంధ్రజ్యోతి): పోలీస్ కస్టడీ నుంచి మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ (Most Wanted Criminal Bathula Prabhakar) పరారీ అయ్యాడు. విజయవాడ కోర్టు (Vijayawada Court) నుంచి రాజమండ్రి (Rajahmundry) సెంట్రల్ జైలుకు తరలిస్తుండగా దుద్దుకూరు దగ్గర బత్తుల ప్రభాకర్ పరారయ్యాడు. దుద్దుకూరు దాబా దగ్గర భోజనం కోసం ఆగిన సమయంలో ప్రభాకర్ పరారీ అయ్యారని రాజమండ్రి పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
బత్తుల ప్రభాకర్‌పై తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. గతంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదుపులోకి తీసుకుంటుండగా పోలీసులపై ప్రభాకర్ కాల్పులు జరిపాడని రాజమండ్రి పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని పోలీసుస్టేషన్లను పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు.
ఈ మేరకు రాజమండ్రి పోలీసు ఉన్నతాధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. బత్తుల ప్రభాకర్ వయసు సుమారు 35 సంవత్సరాలు. ప్రభాకర్ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి వాయిదా నిమిత్తం విజయవాడ తీసుకుని వెళ్లి, మరలా తిరిగి రాజమహేంద్రవరం తీసుకువచ్చే క్రమంలో ఈరోజు సాయంత్రం 7:30 గంటల సమయంలో దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామం వద్ద పోలీసు వారి నుంచి తప్పించుకుని పారిపోయాడని రాజమండ్రి పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
ముద్దాయి బత్తుల ప్రభాకర్ పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయినప్పుడు ఒక చేతికి హ్యాండ్ కప్స్ ఉన్నాయని, ఆయన వైట్ కలర్ టీ షర్ట్, బ్లాక్ కలర్ ట్రాక్ ప్యాంటు ధరించి ఉన్నాడని తెలిపారు. నిందితుడు బత్తుల ప్రభాకర్ ఆచూకీ ఎవరికైనా తెలిస్తే ఈ కింది ఫోన్ నెంబర్లకు తెలియజేయాలని రాజమండ్రి పోలీసు ఉన్నతాధికారులు కోరారు. ఇన్‌స్పెక్టర్ దేవరపల్లి- 9440796584, సబ్ ఇన్‌స్పెక్టర్ దేవరపల్లి- 9440796624 నంబర్‌లలో సంప్రదించాలని సూచించారు. ముద్దాయి బత్తుల ప్రభాకర్ ఆచూకీ లేదా సమాచారం తెలిపిన వారికి తగిన పారితోషకం ఇస్తామని రాజమండ్రి పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సాంకేతిక పరిజ్ఞానంతో కాలుష్య నియంత్రణను పటిష్టం చేయాలి: పవన్ కల్యాణ్
జీఎస్టీ సంస్కరణలతో మేడిన్ ఇండియా మరింత బలోపేతం: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News