Share News

CM Chandrababu on GST Reforms: జీఎస్టీ సంస్కరణలతో మేడిన్ ఇండియా మరింత బలోపేతం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Sep 22 , 2025 | 04:54 PM

జీఎస్టీ సంస్కరణలతో మేడిన్ ఇండియా మరింత బలోపేతం అవుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బలమైన, సమతుల్యమైన సమాజ నిర్మాణమే లక్ష్యమని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.

CM Chandrababu on GST Reforms: జీఎస్టీ సంస్కరణలతో మేడిన్ ఇండియా మరింత బలోపేతం: సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu on GST Reforms

అమరావతి, సెప్టెంబర్ 22 (ఆంధ్రజ్యోతి): జీఎస్టీ సంస్కరణల (GST Reforms)తో మేడిన్ ఇండియా మరింత బలోపేతం అవుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పేర్కొన్నారు. బలమైన, సమతుల్యమైన సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. జీఎస్టీ సంస్కరణలతో ఏపీ ప్రజలకు రూ.8వేల కోట్ల లాభం కలుగుతుందని తెలిపారు. స్వదేశీ, మేకిన్ ఇండియా ప్రచారం మరింత ఊపందుకోవాలని సూచించారు. ఇవాళ(సోమవారం) జీఎస్టీ సంస్కరణలపై ఏపీ అసెంబ్లీలో మాట్లాడారు సీఎం చంద్రబాబు.


దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి..

గృహోపయోగ వస్తువుల వినియోగం బాగా పెరుగుతోందని చెప్పుకొచ్చారు. దేశీయ ఉత్పత్తులు కొనాలని.. దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని దిశానిర్దేశం చేశారు. దసరా నుంచి దీపావళి వరకు జీఎస్టీ ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. నాలుగు వారాల్లో జీఎస్టీపై 65 సమావేశాలు ఏపీలో నిర్వహిస్తామని వెల్లడించారు. జీఎస్టీ సంస్కరణలు భవిష్యత్‌లో గేమ్‌ ఛేంజర్‌ అని ఉద్ఘాటించారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజల జీవితాల్లో అనేక మార్పులు వస్తాయని చెప్పుకొచ్చారు. స్వర్ణాంధ్ర దిశగా ముందుకెళ్లేందుకు జీఎస్టీ సంస్కరణలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.


జీఎస్టీపై యాక్షన్ ప్లాన్..

‘జీఎస్టీపై ఓ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తాం. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అని ప్రధానమంత్రి నరేంద్ మోదీ చెప్పారు. జీఎస్టీ ఫలితాలు పేదలు, అన్నివర్గాల స్టేక్ హోల్డర్‌లకు చేర్చాలి. దీనికి 30 రోజులు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దీని అమలుకు ఒక కమిటీ వేశాం. హెచ్ఆర్డీ మంత్రి లోకేష్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, హోంమంత్రి వంగలపూడి అనిత, టూరిజం మంత్రి కందుల దుర్గేష్‌లతో ఈ కమిటీ వేశాం. జీఎస్టీ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్ధలో కొత్త దశకు నాంది పలుకుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఏపీకి సంబంధించి ప్రగతిశీల విధానాల ద్వారా పేద, మధ్యతరగతి జీవితాలను మార్చాలి. దీనికి సూపర్ జీఎస్టీ, సూపర్ సిక్స్, పీ4లు ఏపీని స్వర్ణాంధ్ర వైపు నడిపిస్తాయి. ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికీ బెనిఫిట్ వస్తుంది. మన రాష్ట్రానికి రూ.8వేల కోట్ల లబ్ది ఉంటుంది. చిన్న వ్యాపారులకు ప్రయోజనం కలుగుతుంది. ఎంఎస్ఎంఈలకు ఊపు వస్తుంది. మేక్ ఇన్ ఇండియాకు దోహదం చేస్తుంది. మన బ్రాండ్‌లు అంతర్జాతీయ బ్రాండ్‌లు అవుతాయి. సెల్ప్ రిలయంట్ ఎకానమీకి ఇది దోహదం చేస్తుంది. భారతీయ ఉత్పత్తులను కొంటే అది కేవలం ఒక లావాదేవి మాత్రమే కాదు.. అది మన సమాజ అభివృద్ధికి హమీ’ అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు..


జీఎస్టీపై అవగాహన...

‘ఇంటింటికీ జీఎస్టీ కరపత్రాలు తీసుకెళ్లి అగ్రికల్చర్, ఇతర అంశాల్లో ఎలా లబ్ధి కలుగుతుందో వివరిస్తాం. జీఎస్టీ సవరణలతో డిజిటల్ ఇండియా, డిజిటల్ ఆంధ్రప్రదేశ్ సాధ్యం. చాలా వరకూ 15వేల గ్రామ సచివాలయాల్లో మీటింగ్‌లు పెట్టి అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం. 10వేల రైతు సేవా కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తాం. అక్టోబర్ 7, 8 తేదీల్లో విద్యాసంస్ధల్లో జీఎస్టీ గురించి వివరిస్తాం. అక్టోబర్ 9న విలేజ్ హెల్త్ సెంటర్‌లు, వెల్ నెస్ సెంటర్లలో కార్యక్రమం నిర్వహిస్తాం. బిల్డింగ్ వర్కర్లతో అక్టోబర్ 11న 850 సెంటర్లలో కార్యక్రమం నిర్వహిస్తాం. విలేజ్ సెక్రటేరియట్, రైతు సేవా కేంద్రాల్లో ఎక్కడికక్కడ ఒక్కొక్కరినీ ఏర్పాటు చేసి ప్రజల్లోకి తీసుకెళ్తాం. మీడియా, హోర్డింగ్స్, ఇంటర్వ్యూలు ఇవ్వడం, పాడ్ కాస్ట్‌ ఇంటర్వ్యూలు, సెలబ్రెటీలతో మాట్లాడించి అన్ని చేస్తాం. ఎమ్మెల్యేలు ఇచ్చే అంశాలను కూడా మంత్రి వర్గ ఉపసంఘం ఇంక్లూడ్ చేస్తుంది. ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఆనందంగా పండుగలను ప్రజలు చేసుకోవాలి’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ

ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 22 , 2025 | 05:40 PM