Share News

Bapatla Accident: కుక్కను తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. స్పాట్‌లోనే..

ABN , Publish Date - Sep 21 , 2025 | 09:18 AM

ప్రయాణికులు తిరుపతి నుంచి పిఠాపురం దేవాలయంలో పూర్వికులకు పిండ ప్రధానం చేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతిచెందిన ముగ్గురు ఓకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించినట్లు పేర్కొన్నారు.

Bapatla Accident: కుక్కను తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టిన కారు..  స్పాట్‌లోనే..
Bapatla Accident

బాపట్ల: మార్టూరు మండలం కోలలపూడి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుక్కను తప్పించబోయి.. ఓ కారు బోల్తా కొట్టి డివైడర్‌‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా..మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.


పోలీసుల కథనం ప్రకారం.. ప్రయాణికులు తిరుపతి నుంచి పిఠాపురం దేవాలయంలో పూర్వికులకు పిండ ప్రధానం చేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతిచెందిన ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. గాయపడిన వారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. మృతిచెందిన వారిలో దామర్ల లక్ష్మణ్(70), ఆయన భార్య సుబ్బాయమ్మ(65), మనవడు హేమంత్ (25) ఉన్నట్లు వివరించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు చెప్పుకొచ్చారు.


జాతీయ రహదారిపై వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. కొద్దిపాటి ఏమరపాటుగా ఉన్న ప్రమాదాలు జరిగే అవకశాలు ఉన్నాయని హెచ్చరించారు. రహదారిపై తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తెలిపారు. డ్రైవర్లకు నిద్రమత్తు వస్తే.. కొద్దిసేపు రహదారి పక్కన ఆపుకుని సేద తీరిన తర్వాత తిరిగి వాహనం నడపాలని పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఓటు చోరీ.. రాహుల్ గాంధీ తుస్సు బాంబులేశాడు.. రామచందర్ రావు సెటైర్లు

మహిళలను బీఆర్‌ఎస్ ఇన్సల్ట్ చేస్తోంది.. మంత్రి సీతక్క ఫైర్

Updated Date - Sep 21 , 2025 | 09:42 AM