Share News

Mithun Reddy Bail: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్

ABN , Publish Date - Sep 29 , 2025 | 03:10 PM

ఏపీ లిక్కర్ కేసులో ఏసీబీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితుడిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.

Mithun Reddy Bail: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్
MP Mithun Reddy

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ.. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రూ.2లక్షలతో రెండు ష్యూరిటీలు ఇవ్వాలని ఆదేశించింది. వారంలో రెండుసార్లు సంతకాలు పెట్టాలని సూచించింది. కాగా, ప్రస్తుతం లిక్కర్ కేసులో ఏ-4 నిందితుడిగా ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్న మిథున్ రెడ్డి రేపు(మంగళవారం) జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి..

విజయ్ పార్టీ నాయకులపై కేసులు నమోదు

ఆసియా కప్‌ ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించిన భారత్‌

Updated Date - Sep 29 , 2025 | 03:23 PM