Share News

Rayachoti Tragedy: రాయచోటిలో తీవ్ర విషాదం.. ముగ్గురు వరద నీటిలో కొట్టుకుపోయి..

ABN , Publish Date - Sep 20 , 2025 | 07:25 AM

ఈ నేపథ్యంలో రాయచోటి పట్టణంలో కురిసిన భారీ వర్షం ప్రజల్లో తీవ్ర విషాదం నింపింది. నిన్న(శుక్రవారం) రాత్రి కురుసిన భారీ వర్షానికి ఎస్ఎన్ కాలనీ అంగన్‌వాడీ వెనుక ఉన్న డ్రైనేజీ కాలువ వరద నీటితో ఉధృతంగా ప్రవహించింది.

Rayachoti Tragedy: రాయచోటిలో తీవ్ర విషాదం.. ముగ్గురు వరద నీటిలో కొట్టుకుపోయి..
Rayachoti

అన్నమయ్య: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో నిన్న(శుక్రవారం) రాత్రి అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా అత్యధిక వర్షపాతం నమోదు అయ్యింది. ఎడతెరిపిలేకుండా కురుసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లన్నీ జలమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాలన్ని చెరువులను తలిపించాయి. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. దీంతో పలు గ్రామాల మధ్యల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


ఈ నేపథ్యంలో.. రాయచోటి పట్టణంలో కురిసిన భారీ వర్షం స్థానిక ప్రజల్లో తీవ్ర విషాదం నింపింది. నిన్న(శుక్రవారం) రాత్రి కురుసిన భారీ వర్షానికి ఎస్ఎన్ కాలనీ అంగన్‌వాడీ వెనుక ఉన్న డ్రైనేజీ కాలువ వరద నీటితో ఉధృతంగా ప్రవహించింది. ఈ వరద నీటిలో ఓ తల్లి, బిడ్డ చిక్కుక పోయారు. అది చూసిన ఓ 25 సంవత్సరాల యువకుడు వారిని కాపాడపోయి.. తానూ వరదలో చిక్కుకున్నాడు. దీంతో ముగ్గురు భారీ వరద ధాటికి నీటిలో కొట్టుకుపోయారు.

కొద్దిసేపటి తరువాత పట్టణంలోని గవర్నర్ ఫంక్షన్ హాల్ వద్ద ముగ్గురు శవాలై తేలారు. సమచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను నీటి నుంచి బయటకు తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో రాయచోటిలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - Sep 20 , 2025 | 07:30 AM