Home » AP Police
డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కాకినాడలోని మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు ఆయనను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు.
తిరుపతిలో ఈడీ సోదాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. తిరుపతి పరిధిలోని తుమ్మలగుంటలో ఉన్న వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో శుక్రవారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
భీమవరం డీఎస్పీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భీమవరానికి చెందిన ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని పోలీసులు బెదిరిస్తున్నారని న్యాయస్థానాన్ని బాలిక తల్లి ఆశ్రయించారు.
ఆంధ్రప్రదేశ్‌లో మనుషుల అక్రమ రవాణాపై అవగాహన పెంచేందుకు ఏపీ మహిళా కమిషన్ కీలక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో రాయపాటి శైలజ నేతృత్వంలో రైల్వే పోలీసులతో కలిసి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును రాజమహేంద్రవరం కోర్టు ప్రాంగణంలో పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆయనను అరెస్టు చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
అనంతపురం నగరంలో వెలుగులోకి వచ్చిన హనీట్రాప్ కేసు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సంపన్న వర్గాలు, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, రియల్టర్లను లక్ష్యంగా చేసుకుని ఒక ముఠా వ్యవహరించిన తీరుపై పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుతో సంబంధం ఉన్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
విశాఖపట్నంలోని గాజువాకలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఎలక్ట్రానిక్ షోరూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
కర్నూలులోని ప్రముఖ వైద్య విద్యాసంస్థలో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి రావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వైద్య విద్యార్థులు సేవాభావంతో ఉండాల్సిన వాతావరణంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనలో ఓ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ర్యాగింగ్‌కు గురయ్యాడని ఆరోపణలు రావడంతో అధికారులు వెంటనే స్పందించారు.
అనకాపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. నక్కపల్లి సమీపంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడటంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది.