Share News

Kethireddy Pedda Reddy: తాడిపత్రిలో ఉద్రిక్తత.. పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు

ABN , Publish Date - Oct 03 , 2025 | 01:26 PM

వివాహానికి వెళ్తానని పోలీసులకు ముందే లేఖ ద్వారా సమాచారం ఇచ్చానని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చినా.. ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని నిలదీశారు.

Kethireddy Pedda Reddy: తాడిపత్రిలో ఉద్రిక్తత.. పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు
Kethireddy Pedda Reddy

అనంతపురం: తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా.. కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు నిర్బంధించారు. తాడిపత్రి పట్టణంలోని పుట్లూరు రహదారిలో పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు పెద్దారెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ మేరకు పోలీసులపై పెద్దారెడ్డి నిప్పులు చెరిగారు.


తాను వివాహానికి వెళ్తానని పోలీసులకు ముందే లేఖ ద్వారా సమాచారం ఇచ్చానని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చినా.. ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని నిలదీశారు. దీంతో చాలసేపటి వరకు పోలీసులకు పెద్దారెడ్డికి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కొద్దిసేపటి తరువాత చేసేదేమిలేక.. కేతిరెడ్డి పెద్దారెడ్డి వివాహ కార్యక్రమానికి వెళ్లకుండానే తిరిగి తన ఇంటికి వెళ్లిపోయారు.


ఇవి కూడా చదవండి..

TamilNadu Bomb Threat: సీఎం స్టాలిన్, నటి త్రిష నివాసాలకు బాంబు బెదిరింపులు..

Notorious Cattle Thief : చోరీ చేసిన పశువులను వధిస్తున్న యూనిట్‌పై పోలీసు దాడులు

Updated Date - Oct 03 , 2025 | 01:46 PM