Tragic Incident in Kadapa: కడప జిల్లాలో అమానుషం.. కన్నతల్లిని దారుణంగా..
ABN , Publish Date - Oct 05 , 2025 | 11:43 AM
కడప జిల్లాలోని ప్రొద్దుటూరు శ్రీరామ్ నగర్‌లో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నతల్లి లక్ష్మీదేవిని కొడుకు యశ్వంత్ రెడ్డి హత్య చేశాడు. యశ్వంత్ రెడ్డికి గత కొన్నేళ్లుగా మానసిక స్థితి సరిగా లేదు. ఈ క్రమంలో తనను తల్లి తిట్టిందని కూరగాయల కత్తితో గొంతుకోసి యశ్వంత్ రెడ్డి హత్యచేశాడు.
కడప, అక్టోబరు5 (ఆంధ్రజ్యోతి): కడప జిల్లాలో (Kadapa District)ని ప్రొద్దుటూరు శ్రీరామ్ నగర్‌లో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నతల్లి లక్ష్మీదేవిని కొడుకు యశ్వంత్ రెడ్డి హత్య చేశాడు. యశ్వంత్ రెడ్డికి కొన్నేళ్లుగా మానసిక స్థితి సరిగా లేదు. ఈ క్రమంలో తనను తల్లి తిట్టిందని కూరగాయల కత్తితో గొంతుకోసి యశ్వంత్ రెడ్డి హత్యచేశాడు. వంటింట్లో లక్ష్మీదేవి ఉండగా ఆమెతో గొడవ పడ్డాడు యశ్వంత్ రెడ్డి. కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేశాడు. వంటింట్లో రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని అలాగే ఈడ్చుకుంటూ ఇంటి బయట పడేశాడు యశ్వంత్ రెడ్డి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
తల్లి లక్ష్మిదేవి ఈశ్వర్‌రెడ్డి నగర్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. నిందితుడు యశ్వంత్ రెడ్డి బీటెక్ పూర్తి చేసి, ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. తల్లిని హత్య చేసే సమయంలో తండ్రి విజయ భాస్కర్‌ని గదిలో బంధించాడు యశ్వంత్ రెడ్డి. తాను దుస్తులు మార్చుకోడానికి గదిలోకి వెళ్లగా బయట నుంచి తలుపుకి గడియ పెట్టాడు. అనంతరం వంట గదిలోకి వెళ్లి తన భార్య లక్ష్మిదేవిని అత్యంత దారుణంగా తన కుమారుడు యశ్వంత్ రెడ్డి హత్య చేశారని కన్నీరు మున్నీరుగా విలపించాడు విజయ భాస్కర్. ఈ ఘటనపై విజయ భాస్కర్ పోలీసులకు సమాచారం అందజేశారు. ఫిర్యాదు మేరకు నిందితుడు యశ్వంత్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు కడప జిల్లా పోలీసులు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
Read Latest AP News And Telugu News