Share News

AP Police Jobs: గుడ్ న్యూస్.. భారీగా పోలీస్ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్..!

ABN , Publish Date - Oct 09 , 2025 | 03:21 PM

ఆగస్టు 31వ తేదీవరకు రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో గుర్తించిన ఖాళీలను మాత్రమే ప్రభుత్వానికి డీజీపీ పంపించారు. రాష్ట్రంలో రోజురోజుకూ నేరాలు పెడుతున్నాయని, నేరస్తులు కొత్త కొత్త విధానాల్లో నేరాలు చేస్తున్నారని లేఖలో పేర్కొంది.

AP Police Jobs: గుడ్ న్యూస్.. భారీగా పోలీస్ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్..!
AP Police

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు పోలీస్ శాఖ త్వరలోనే శుభవార్త అందించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను పోలీసు శాఖ భర్తీకి కసరత్తు చేస్తోంది. వివిధ డిపార్ట్‌మెంట్‌లలో అంటే సివిల్, ఆర్మ్‌డ్‌ రిజర్వు, స్పెషల్ ఆర్మ్‌డ్‌ రిజర్వు, ఏపీఎస్పీ, సీపీఎల్, పీటీఓ, కమ్యూనికేషన్స్‌లో ఉన్న ఉద్యోగ ఖాళీలను పూర్తి చేసేందుకు నిమగ్నమంది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర సర్కారుకు డీజీపీ పంపించారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరిశీలించి అనుమతి ఇవ్వగానే ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది.


అయితే డీజీపీ కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ.. పంపించిన లేఖలో ఉద్యోగ ఖాళీలను ప్రస్తావించింది. సివిల్ పోలీస్ ఫోర్స్‌లో 315 ఎస్సైలు, 3580 సివిల్‌ కానిస్టేబుల్‌, 96 ఆర్‌ఎస్‌ఐ పోస్టులు, 2520 ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల భర్తీకి అనుమతించాలని కోరింది. సర్కార్ నుంచి అనుమతి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ రిక్రూట్‌మెంట్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు సమాచారం.


కాగా, ఆగస్టు 31వ తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో గుర్తించిన ఖాళీలను మాత్రమే ప్రభుత్వానికి డీజీపీ పంపించారు. రాష్ట్రంలో రోజురోజుకూ నేరాలు పెరుగుతున్నాయని, నేరస్తులు కొత్త కొత్త విధానాల్లో నేరాలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కట్టుదిట్టం చేయాలంటే పోలీస్ ఫోర్స్ అవసరం ఉందని, అందుకోసం తాము విజ్ఞప్తి చేసిన పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేసి నోటిఫికేషన్ ఇచ్చేందుకు అనుమతినివ్వాలని డీజీపీ విన్నవించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడికి పగ్గాల్లేవ్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

భారత్‌ దాల్‌.. అంతా గోల్‌మాల్‌!

Updated Date - Oct 09 , 2025 | 03:21 PM