Home » AP News
పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు 7,788 క్యూసెక్కుల గోదావరి జలాలను విడుదల చేసినట్లు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఈఈ యేసుబాబు మంగళవారం తెలిపారు.
మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (ఎంజేపీ ఏపీ బీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్)లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.
బీసీల ద్రోహి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అని, ఆయన చేసిన అన్యాయాలన్నీ రాష్ట్రం మొత్తం తిరిగి చెప్తామని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న ప్రకటించారు.
స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈలే కీలక పాత్ర అని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు.
రాష్ట్రంలో తమ పెట్టుబడులను మరింత విస్తరించేందుకు శ్రీ సిమెంట్స్ కంపెనీ ముందుకువచ్చిందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్ తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం ఆయన అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరుగనుంది.
రాజధాని అమరావతిలో నెలకు రూ.2వేల కోట్ల విలువైన పనులు జరిగేలా ప్రణాళికతో పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం అమరావతి పనులపై క్యాంపు కార్యాలయంలో అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో ఆయన నెలవారీ సమీక్ష నిర్వహించారు.
సంతూర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం 2026-27కు రాష్ట్రంలో ఆర్ధికంగా వెనుకబడిన అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్ధునులు దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ ప్రతినిధులు పి.ఎస్.నారాయణ్, నీరజ్ ఖత్రి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ బుధవారం విడుదల చేయనుంది. అక్టోబరు నెలకు సంబంధించిన రూ.300 దర్శన టికెట్లను టీటీడీకి ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా విడుదల చేసింది.
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారికి హైదరాబాద్‌కు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు సుమారు రూ.2 కోట్ల విలువైన ఆభరణాలను సమర్పించారు.