Share News

రాష్ట్రంలో పెరిగిన ఎండ.. కర్నూలులో 36.3 డిగ్రీలు

ABN , Publish Date - Feb 21 , 2026 | 05:34 AM

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో శుక్రవారం ఎండ తీవ్రత పెరిగింది. కర్నూలులో 36.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

రాష్ట్రంలో పెరిగిన ఎండ.. కర్నూలులో 36.3 డిగ్రీలు

  • నేడు, రేపు పిడుగులతో కూడిన వర్షాలు

అమరావతి, విశాఖపట్నం, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో శుక్రవారం ఎండ తీవ్రత పెరిగింది. కర్నూలులో 36.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం శుక్రవారం బలహీనపడింది. అయితే దీనిపై ఆవరించిన ఉపరితల ఆవర్తనం పశ్చిమ వాయవ్యంగా పయనించి శ్రీలంక వైపు రానున్నది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Updated Date - Feb 21 , 2026 | 05:35 AM