Share News

గంజాయి కేసులో భీమిలి ఎంపీటీసీ అరెస్టు

ABN , Publish Date - Feb 21 , 2026 | 05:37 AM

గంజాయి కేసులో పట్టుబడి పరారీలో ఉన్న నిందితులను కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెంలో జగ్గంపేట పోలీసులు పట్టుకున్నారు.

గంజాయి కేసులో భీమిలి ఎంపీటీసీ అరెస్టు

  • కిర్లంపూడిలో పట్టుబడిన చెల్లూరి నగేష్ బాబు

  • నిందితుడికి బొత్స కుటుంబంతో సంబంధాలు!

కాకినాడ, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): గంజాయి కేసులో పట్టుబడి పరారీలో ఉన్న నిందితులను కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెంలో జగ్గంపేట పోలీసులు పట్టుకున్నారు. వీరిలో విశాఖ జిల్లా భీమిలి మండలం దాకమర్రికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు చెల్లూరి నగేష్ బాబు ఉన్నారు. నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడికి, భీమిలి ఎంపీపీ సూర్యనారాయణరాజుకు ప్రధాన అనుచరుడని తెలుస్తోంది. జగ్గంపేట పోలీసుల కథనం ప్రకారం... గత సెప్టెంబరు 23న విశాఖ నుంచి కారులో గంజాయిని తరలిస్తుండగా నాగేశ్‌బాబు సహా 8 మందిని పోలీసులు గుర్తించారు. 355.570 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో నలుగురిని అరెస్టు చేయగా వారు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారు. మరో నలుగురు పరారీలో ఉండగా.. వారిలో నగేష్ బాబును శుక్రవారం అరెస్టు చేసినట్టు జగ్గంపేట సీఐ శ్రీనివాస్‌ వెల్లడించారు.

Updated Date - Feb 21 , 2026 | 05:37 AM