క్రీడా పోటీలతో పోలీసుల్లో మానసికోల్లాసం
ABN , Publish Date - Feb 21 , 2026 | 05:31 AM
నిత్యం విధి నిర్వహణలో సతమతమయ్యే పోలీసులకు క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని హోం మంత్రి అనిత అన్నారు.
మంగళగిరి ఏపీఎస్పీలో పోలీస్ క్రికెట్ టోర్నీ ప్రారంభం
మంగళగిరి సిటీ, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): నిత్యం విధి నిర్వహణలో సతమతమయ్యే పోలీసులకు క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని హోం మంత్రి అనిత అన్నారు. మంగళగిరి ఏపీఎస్పీ ఆరవ పటాలంలో రెండవ ఆలిండియా పోలీస్ సౌత్ జోన్ టీ20 క్రికెట్ టోర్నమెంటును శుక్రవారం డీజీపీ హరిశ్ కుమార్ గుప్తాతో కలిసి ప్రారంభించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, ఐటీబీబీ, బోర్డర్ జట్ల సభ్యుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. హోంమంత్రి అనిత మహిళా సిబ్బందికి కూడా ఈ తరహా పోటీలు నిర్వహించాలని అభిప్రాయపడ్డారు.