Share News

మిరప ఎగుమతికి నాణ్యతే కీలకం: మంత్రి అచ్చెన్న

ABN , Publish Date - Feb 21 , 2026 | 05:45 AM

అంతర్జాతీయ మార్కెట్‌లో నాణ్యమైన మిర్చికి విపరీతమైన డిమాండ్‌ ఉందని, రైతులు దీనిపై దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

 మిరప ఎగుమతికి నాణ్యతే కీలకం: మంత్రి అచ్చెన్న

గుంటూరు(తూర్పు), ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ మార్కెట్‌లో నాణ్యమైన మిర్చికి విపరీతమైన డిమాండ్‌ ఉందని, రైతులు దీనిపై దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గుంటూరులో శుక్రవారం జరిగిన మిర్చి యార్డు నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ పద్ధతులపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. 2019-24 మధ్య ధ్వంసమైన యార్డును పునఃనిర్మాణం చేయాల్సిన బాధ్యత నూతన కమిటీపై ఉందన్నారు. గుంటూరు యార్డు చైర్మన్‌ కుర్రా అప్పారావు మాట్లాడుతూ దేశంలోనే యార్డు ప్రథమ స్ధానంలో నిలిపేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Updated Date - Feb 21 , 2026 | 05:46 AM