Share News

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

ABN , Publish Date - Feb 21 , 2026 | 05:14 AM

ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ, మిలాన్‌-2026లో పాల్గొనేందుకు విశాఖ విచ్చేసిన దేశ, విదేశాలకు చెందిన నౌకాదళ అధికారుల కుటుంబ సభ్యులు పల్లె వాతావరణంలో సందడి చేశారు.

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

  • పల్లెబాట పట్టిన నేవీ డెలిగేట్స్‌.. ఆడి పాడిన విదేశీ వనితలు

  • 50 దేశాల అధికారుల కుటుంబాల సందడి

పెందుర్తి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ, మిలాన్‌-2026లో పాల్గొనేందుకు విశాఖ విచ్చేసిన దేశ, విదేశాలకు చెందిన నౌకాదళ అధికారుల కుటుంబ సభ్యులు పల్లె వాతావరణంలో సందడి చేశారు. సుమారు 50 దేశాలకు చెందిన ప్రతినిధులు శుక్రవారం ప్రత్యేక బస్సులో విశాఖ జిల్లా పెందుర్తి మండలం పెదగాడిలోని సంకల్ప కళా గ్రామాన్ని సందర్శించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గ్రామంలో ఉల్లాసంగా గడిపారు. గ్రామంలో నిర్వహించిన టై అండ్‌ డై వర్క్‌షాపులో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సహజ సిద్ధమైన రంగులతో ఉన్న చేనేత వస్త్రాలను చూసి మురిసిపోయారు. స్వయంగా వస్త్రాలు నేసి, రంగులు అద్దారు. మగ్గంతో నేతపై ఆసక్తి కనబరిచారు. కొబ్బరి చిప్పలతో చేసిన కళాకృతులు, దేశీయ హస్తకళలను తిలకించారు. భక్తి గీతాలకు కోలాటం కళాకారులతో కలిసి నృత్యాలు చేశారు. వెదురు టోపీలు ధరించారు. కంచు బిందెలు తలపై, నడుముపై పెట్టుకుని ర్యాంప్‌ వాక్‌ చేసి నవ్వులు పూయించారు.

Updated Date - Feb 21 , 2026 | 05:15 AM