Share News

ఉగాదికి అన్ని దేవాలయాల్లో అక్షరాభ్యాసం

ABN , Publish Date - Feb 21 , 2026 | 05:39 AM

హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్‌(హెచ్‌డీపీటీ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉగాదికి అన్ని దేవాలయాల్లో పిల్లలకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ట్రస్టుచైర్మన్‌ దాసరి శ్రీనివాసులు తెలిపారు.

ఉగాదికి అన్ని దేవాలయాల్లో అక్షరాభ్యాసం

  • హెచ్‌డీపీటీ చైర్మన్‌ దాసరి శ్రీనివాసులు

ఇంద్రకీలాద్రి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్‌(హెచ్‌డీపీటీ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉగాదికి అన్ని దేవాలయాల్లో పిల్లలకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ట్రస్టుచైర్మన్‌ దాసరి శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్‌ జిల్లాల హెచ్‌డీపీటీ కోఆర్డినేటర్లు, దేవదాయ శాఖ కార్యనిర్వహణాధికారులు, అర్చకుల సమాఖ్యతో సమావేశం నిర్వహించారు. శ్రీనివాసులు మాట్లాడుతూ గోదావరి, కృష్ణా పుష్కరాలను పురస్కరించుకొని ఇప్పటినుంచే ఆయా నదుల వెంట దేవతా వృక్షాలు నాటించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వివరించారు. మార్చి 7న కంచి పీఠాధిపతి, సీఎం చంద్రబాబు సమక్షంలో ప్రకాశం బ్యారేజీ నుంచి హంసలదీవి వరకు మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. దుర్గగుడి ఈవో శీనానాయక్‌, బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ రాంప్రసాద్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త వెలగపూడి గోపాలకృష్ణ తదితరులు ప్రసంగించారు.

Updated Date - Feb 21 , 2026 | 05:41 AM