Home » AP Govt
స్వచ్ఛవాయు సర్వేక్షణ్‌లో గుంటూరుకు జాతీయ స్థాయిలో రెండో స్థానం వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. నేషనల్ క్లీన్ ఎయిర్ సిటీస్‌గా గుంటూరు, విజయవాడలోని వార్డులకు అవార్డులు వచ్చాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసి మూడేళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా సీఎం భావోద్వేగ పోస్ట్ పెట్టారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు జరుగనుంది. జిల్లా కలెక్టర్లతో రెండు రోజుల పాటు ఈ సమావేశం నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు (బుధవారం) అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. అంబాజీపేట మండలం మాచవరంలో గ్రౌండ్ రెంట్ భూముల్లో నివసిస్తున్న కుటుంబాలను ముఖ్యమంత్రి కలిశారు.
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల ఖరారుకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది.
ఆత్మహత్యల నివారణకు బహుముఖ వ్యూహం అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2027 గోదావరి పుష్కరాలకు ఆర్ & బీ రోడ్ల అభివృద్ధికి రూ. 300 కోట్ల నిధులు మంజూరు చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో 9 సెప్టెంబరు 2023 గుర్తుండిపోయే రోజని మంత్రి నాదెండ్ల మనోహర్, టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు పేర్కొన్నారు. నేటికి చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి మూడేళ్లు గడిచాయంటూ.. ఆనాటి విషాద సంఘటనను గుర్తుచేసుకున్నారు.
ఇకపై సీసీఐ ద్వారా కనీస మద్దతు ధరకు పత్తి కొనుగోళ్లు, ప్రామాణిక నిర్వహణ విధానం(ఎస్‌వోపీ) అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు కార్యాచరణ ప్రణాళికతో మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
హస్తకళాకారుల అభివృద్ధికి కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. క్లస్టర్ల వారీగా కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు వేగంగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు.