AP investment: పెట్టుబడుల సాధనలో ఏపీ మరో రికార్డు
ABN , Publish Date - Jan 02 , 2026 | 07:12 PM
బ్యాంక్ ఆఫ్ బరోడా తాజా నివేదికలో పెట్టుబడుల సాధనలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్‌గా నిలిచింది. ఈ నివేదికను ప్రస్తావిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో మంత్రి నారా లోకేశ్ ట్వీట్ పెట్టారు.
అమరావతి, జనవరి2 (ఆంధ్రజ్యోతి): బ్యాంక్ ఆఫ్ బరోడా తాజా నివేదికలో పెట్టుబడుల సాధనలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం నెంబర్‌వన్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన నివేదికను ప్రస్తావిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) ట్వీట్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ముందుకు దూసుకెళ్తుందని అంటూ ఈ విషయాన్ని లోకేశ్ పంచుకున్నారు. 2025- 2026 ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది నెలల్లోనే దేశవ్యాప్తంగా ప్రకటించిన పెట్టుబడుల్లో 25.3 శాతం ఆంధ్రప్రదేశ్ ఆకర్షించిందని తెలిపారు మంత్రి నారా లోకేశ్.
13.1 శాతంతో ఒరిస్సా, 12.8 శాతంతో మహారాష్ట్రాలకు రెండు, మూడు స్థానాలు వచ్చాయని వెల్లడించారు. దేశం మొత్తం పెట్టుబడుల్లో 51.2 శాతం ఈ మూడు రాష్ట్రాలు సాధించాయని వివరించారు. దేశవ్యాప్తంగా పెట్టుబడి ప్రకటనలు 26.6 లక్షల కోట్లు అని ఈ నివేదికలో పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే దేశవ్యాప్తంగా 11.5 శాతం వృద్ధి సాధించిందని చెప్పుకొచ్చారు. వేగవంతమైన నిర్ణయాలు, స్థిరమైన విధానాలే ఏపీ విజయానికి కారణమని తెలిపారు.
పోర్టులు, ఇండస్ట్రీయల్ కారిడార్లు, లాజిస్టిక్స్, ఎనర్జీ, డిజిటల్ మౌలిక వసతులపై ఏపీ దృష్టి సారించిందని పేర్కొన్నారు. మ్యాన్‌ఫ్యాక్చరింగ్ రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, మొబిలిటీ రంగాల్లో ఏపీకి భారీ పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. దేశంలోనే పెట్టుబడులకు కేంద్ర బిందువుగా ఏపీ మారిందని చెప్పుకొచ్చారు. కనెక్టివిటీ, ఫ్రెండ్లీ పాలసీలు కలిగి ఉండటంతోనే ఏపీ తొలి ఎంపికగా మారిందని వెల్లడించారు. భారతదేశ పారిశ్రామిక అభివృద్ధికి ఏపీ రథసారధి అంటూ ఎక్స్‌లో మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
శంకర్ విలాస్ ఆర్ఓబీ పనులపై పెమ్మసాని క్లారిటీ
వైసీపీకి ఊహించని షాక్.. టీడీపీలోకి కీలక నేత
Read Latest AP News And Telugu News