ఫిబ్రవరిలో డీఎస్సీ? 2,500 పోస్టుల భర్తీకి కసరత్తు.. ?

ABN, Publish Date - Jan 03 , 2026 | 10:56 AM

డీఎస్సీ నిర్వహణకు సంబంధించిన ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. సుమారు 2,500 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది.

అమరావతి, జనవరి 3: ఉపాధ్యాయ కొలువుల భర్తీకి ఏపీ ప్రభుత్వం (AP Govt) మరోసారి సమాయత్తం అవుతోంది. ఈ క్రమంలో డీఎస్సీ నిర్వహణకు సంబంధించిన ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. సుమారు 2,500 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ఈ సంవత్సరం ఎక్కువ మంది ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయనున్నాను. అదే విధంగా స్వల్ప సంఖ్యలో ఖాళీలు కూడా ఉన్నాయి. దీంతో ఆయా పోస్టులను పాఠశాల విద్యాశాఖ భర్తీ చేయనుంది.


ఇవి కూడా చదవండి...

ఎయిర్, వాటర్ ప్యూరిఫయ్యర్స్‌పై పన్ను కోత.. యోచనలో జీఎస్‌టీ కౌన్సిల్

గాల్లో చక్కర్లు కొట్టిన సింగపూర్‌ ఇండిగో ఫ్లైట్.. అరగంట తర్వాత..

Read Latest AP News And Telugu News

Updated at - Jan 03 , 2026 | 11:05 AM