Home » AP Govt
‘మొంథా’ తుపాను వస్తోందని.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు దిశానిర్దేశం చేశారు. ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకూడదని ఆదేశించారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఎన్నడూ చేయని కామెంట్లను చేసినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఈ పోస్టులకు సంభందించి స్క్రీన్ షాట్లు, లింకులను కూడా తన ఫిర్యాదులో జత చేసినట్లు తెలిపారు.
బైక్‌పై వెళ్తూ మృతి చెందిన శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామిని పోలీసులు గుర్తించారు. ఇద్దరూ కలిసి డోన్‌కు వెళ్తుండగా.. ఇరువురిని బస్సు ఢీకొన్నట్లు తెలిపారు.
వాయుగుండం ఆంధ్రప్రదేశ్ తీరం దిశగా పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూఏఈ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. దుబాయ్‌లో మూడో రోజు పర్యటనలో భాగంగా యూఏఈ ఆర్థిక వ్యవహారాలు, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు.
అటవీ శాఖ సిబ్బంది భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అడవుల ఆక్రమణలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటన అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.
కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద శుక్రవారం బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకి కారణమైన కావేరీ ట్రావెల్స్ బస్సు యాజమాన్యం, డ్రైవర్ ముత్యాల లక్ష్మయ్యలపై కర్నూలు జిల్లా పోలీసులు కేసులు నమోదు చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీకి రాకుండా బాలకృష్ణ గురించి మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు.
భూ సంస్కరణలపై శుక్రవారం ఏపీ సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో ఈ భేటీ జరిగింది.