Home » AP Govt
కల్తీ మద్యం కేసులో గతంలో ఇబ్రహీంపట్నంలోని మద్యం తయారీ యూనిట్‌ను అధికారులు తెరిచారు. ఇబ్రహీంపట్నంలోని ఏఎన్‌ఆర్ బార్‌లో కనిపించిన నకిలీ మద్యం మరకలు విజయవాడలోని ఓ వైన్ షాపులో కనిపించాయి.
ఏపీ కేబినెట్ సమావేశాన్ని నవంబర్ 10వ తేదీకి వాయిదా వేస్తూ సీఎస్ కార్యాలయం నోట్ విడుదల చేసింది.
మత్స్యకారులకు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద సాయం అందేలా చర్యలు ఉంటాయని అధ్యక్షుడు మాధవ్ పేర్కొన్నారు. బీమా, లోన్ సౌకర్యాలు పథకంలో ఉన్నాయని తెలిపారు.
మంత్రి లోకేశ్ ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టుకుని.. మోసాలకు పాల్పడుతున్న ముఠాను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిందితులకు కోర్టు 14 రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
ఛైర్మన్ పదవి నుంచి తలారి రాజ్ కుమార్‌ను తొలగిస్తూ.. పురపాలక పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అయితే రాజ్ కుమార్ కౌన్సిల్ సమావేశాలు సరిగ్గా నిర్వహించడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
తుఫాన్ వల్ల దాదాపు 4576 కి.మీ మేర ఆర్ & బీ రహదారులు ధ్వంసమైనట్లు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. 120 చోట్ల ఆర్ & బీ రహదారులు దెబ్బ తినగా.. 21 చోట్ల పునరుద్దరణ చేసినట్లు పేర్కొన్నారు.
మొంథా తుఫాను ప్రభావంతో విశాఖపట్నం జిల్లాలో గురువారం పాఠశాలలకు, అంగన్వాడీలకు సెలవు ఇస్తున్నామని జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ ప్రకటించారు. మొంథా తుఫాను నేపథ్యంలో వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ హరేందిర ప్రసాద్ పేర్కొన్నారు.
పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించాలనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని.. అది చట్టవిరుద్దం అయితే తప్ప కోర్టులు జోక్యం చేసుకోలేవని ఏపీ హై కోర్టు స్పష్టం చేసింది. టెండర్ ప్రక్రియను అడ్డుకుంటూ ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు క్లారిటీ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన చేయనున్నారు. నవంబరు 2వ తేదీ నుంచి సీఎం చంద్రబాబు లండన్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన ఖరారైంది.
గత వైసీపీ ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాలని పునర్విభజించిదని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శలు చేశారు. జగన్ హయాంలో రాజకీయంగా లబ్ధి పొందేందుకు జిల్లాలు పునర్విభజించిందని అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు.