Suryanarayana: ప్రభుత్వ లాంఛనాలతో గుండ అప్పల సూర్యనారాయణ అంత్యక్రియలు.. సీఎం ఆదేశాలు..
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:20 AM
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు గుండ అప్పల సూర్యనారాయణ తుదిశ్వాస విడిచారు. తలకు గాయం కావడంతో చికిత్స పొందుతూ ఆయన సోమవారం కన్నుమూశారు. ఈ విషాదంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు..
శ్రీకాకుళం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు గుండ అప్పల సూర్యనారాయణ (Gunda Appala Suryanarayana) తుదిశ్వాస విడిచారు. తలకు గాయం కావడంతో చికిత్స పొందుతూ ఆయన సోమవారం కన్నుమూశారు. ఆ మృతిపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.
అంత్యక్రియలకు హాజరు కావాలి..
సూర్యనారాయణ అంత్యక్రియలకు టీడీపీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు హాజరు కావాలని సీఎం ఆదేశించారు. ఈ క్రమంలోనే వారి కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా సూర్యనారాయణతో తనకు ఉన్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నా.. ఎప్పుడూ ఆయన సాధారణ జీవితం గడిపారని కొనియాడారు. నిజాయితీగా ఎంతో ఆదర్శవంతమైన రాజకీయాలు చేసిన సూర్యనారాయణ అందరికీ ఆదర్శమని కీర్తించారు. టీడీపీకి సూర్యనారాయణ చేసిన సేవలు ఎప్పుడూ మరిచిపోమని, వారి కుటుంబంపై తనకు అత్యున్నత గౌరవం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
అనంతపురంలో భారీ అగ్నిప్రమాదం.. ఏం జరిగిందంటే...
రాష్ట్ర ప్రగతే లక్ష్యంగా సమగ్ర సమీక్ష.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
Read Latest AP News And Telugu News