Home » AP Assembly Sessions
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో సోమవారం పలు కీలక బిల్లులపై చర్చ జరిగింది. చర్చల అనంతరం ఈ బిల్లులకు శాసన మండలి ఆమోదం తెలిపింది. మోటార్ వెహికిల్ ట్యాక్సేషన్ సవరణ బిల్లు -2025ను శాసన మండలి ఆమోదించింది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో మంత్రి నారా లోకేష్ సోమవారం అసెంబ్లీలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
2014-19లో కేంద్ర ప్రభుత్వం 7,01,481 టిడ్కో ఇళ్లను ఏపీకి కేటాయించిందని మంత్రి నారాయణ గుర్తుచేశారు. వీటిలో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి పాలనా అనుమతులు తీసుకుని టెండర్లు పిలిచామన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక ప్లాంట్ నిర్వహణకు నిధులు కేటాయించారని ఎమ్మెల్యే వసంత వెల్లడించారు. ప్లాంట్ నుంచి కాలుష్యం పరిమితికిమించి విడుదల అవుతోందని.. విద్యుత్ ప్లాంట్ అమరావతికి కూడా అతి సమీపంలో ఉందని తెలిపారు.
ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ప్రశ్నకు మంత్రి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు. యువగలం పాదయాత్ర సందర్భంగా టీచర్లు ఈ సమస్య తన దృష్టికి తెచ్చారని గుర్తు చేశారు.
జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చి నాలుగు స్లాబులను రెండు స్లాబులకు ప్రధాని తీసుకువచ్చారని మంత్రి సత్యకుమార్ తెలిపారు. దేశంలోని ప్రతీ వర్గానికి మేలు చేసేలా ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు.
సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు హాట్ కామెంట్స్ చేశారు. జగన్ ఎంపీగా, గతంలో ఐదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా చేశారని..ఆయనకు రూల్స్ తెలియకుండా కామెంట్స్ చేస్తారా అని ప్రశ్నల వర్షం కురిపించారు.
కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు రాజోలు నియోజకవర్గంలోని తూర్పు పాలెం, అమలాపురం నియోజకవర్గం మామిడికుదురు మండలం పెదపట్నం లంక ఉప్పలగుప్తంలో పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని మంత్రి కొండపల్లి వెల్లడించారు.
AP Irrigation Projects: పోలవరాన్ని గత ప్రభుత్వం ప్రశ్నార్ధకం చేసిందని మంత్రి నిమ్మల విమర్శించారు. టీడీపీ 72 శాతం పూర్తి చేయగా వీరు అయిదేళ్లలో 2 శాతం పూర్తి చేశారన్నారు. 2027 డిసెంబర్ నాటికి ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.
ఏపీ అసెంబ్లీ షెడ్యూల్‌ను ఈనెల 27 వరకు కుదించారు. అంటే సెప్టెంబర్ 30 వరకు కొనసాగాల్సిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు సెప్టెంబర్ 27తో ముగియనున్నాయి.