-
-
Home » Mukhyaamshalu » AP ASSEMBLY SESSION DAY 3 LIVE UPDATES VREDDY
-
AP Assembly Live: బలమైన, సమతుల్యమైన సమాజ నిర్మాణమే లక్ష్యం: చంద్రబాబు
ABN , First Publish Date - Sep 22 , 2025 | 10:18 AM
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఈరోజు వ్యవసాయ రంగంతో పాటు పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. అసెంబ్లీలో జరిగే ముఖ్యమైన చర్చ, అంశాలను ABN లైవ్ అప్డేట్స్‌తో మీ ముందుకు..
Live News & Update
-
Sep 22, 2025 16:45 IST
GST సంస్కరణలపై అసెంబ్లీలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు
GST సంస్కరణలతో మేడిన్ ఇండియా మరింత బలోపేతం: సీఎం చంద్రబాబు
బలమైన, సమతుల్యమైన సమాజ నిర్మాణమే లక్ష్యం: చంద్రబాబు
GST సంస్కరణలతో ఏపీ ప్రజలకు రూ.8వేల కోట్ల లాభం: సీఎం చంద్రబాబు
స్వదేశీ, మేకిన్ ఇండియా ప్రచారం మరింత ఊపందుకోవాలి: సీఎం చంద్రబాబు
గృహోపయోగ వస్తువుల వినియోగం బాగా పెరుగుతోంది: సీఎం చంద్రబాబు
దేశీయ ఉత్పత్తులు కొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి: సీఎం చంద్రబాబు
-
Sep 22, 2025 13:07 IST
అమరావతి: టిడ్కో ఇళ్లపై ఏపీ అసెంబ్లీలో షార్ట్ నోట్ డిస్కషన్
చంద్రబాబు హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం జరిగింది: విష్ణుకుమార్
జగన్ హయాంలో ఇళ్ల నిర్మాణం సరిగా జరగలేదు.. బిల్లులు రాలేదు
కొన్నిచోట్ల పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారు: విష్ణుకుమార్
టిడ్కో ఇళ్లకు డబ్బు కట్టిన వారికి కేటాయింపులు జరగలేదు: విష్ణుకుమార్
బ్యాంకులకు అప్పు చెల్లించలేక లబ్ధిదారులు ఇబ్బందులు: విష్ణుకుమార్‌రాజు
విశాఖ ట్రై జంక్షన్‌లో టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి: విష్ణుకుమార్‌రాజు
పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి: విష్ణుకుమార్‌రాజు
జగన్ హయాంలో ఫొటోతో వేసుకున్న టిడ్కో ఇళ్ల పట్టాను...
సభలో చూపించిన మంత్రి విష్ణుకుమార్ రాజు
-
Sep 22, 2025 12:26 IST
NTTPS కాలుష్యం, ప్రజల జీవనోపాధిపై ఎమ్మెల్యే వసంతకృష్ణ...
ప్రశ్నలకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానం
NTTPS కాలుష్య నియంత్రణకు చర్యలు చేపడుతున్నాం: గొట్టిపాటి
NTTPSలో మరమత్తులు చేపడుతున్నాం: మంత్రి గొట్టిపాటి
పాండ్ యాష్ అక్రమ నిల్వ, తరలిస్తున్న కారణంగానే కాలుష్యం
PCB సూచనల ప్రకారం బూడిద తరలింపుకు ప్రభుత్వం టెండరింగ్ ఏజెన్సీని నియమించింది
-
Sep 22, 2025 12:22 IST
అమరావతి: ప్రైమరీ స్కూళ్లను అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో విలీనంపై...
ఎమ్మెల్యే చదలవాడ ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం
యువగళం పాదయాత్రలో సమస్యను నా దృష్టికి తెచ్చారు: లోకేష్
ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి అనేది మా లక్ష్యం: లోకేష్
మన బడి-మన భవిష్యత్తు కింద విద్యార్థుల సంఖ్య ఆధారంగా...
టీచర్ల నియామకం, తరగది గదుల నిర్మాణం చేపడుతున్నాం: లోకేష్
పాఠశాల భవన నిర్మాణాల కోసం దాతల సహకారం కోరుతున్నాం: లోకేష్
-
Sep 22, 2025 12:08 IST
పీ అసెంబ్లీలో నేడు వ్యవసాయ రంగంపై కీలక చర్చ.. సీఎం ప్రకటన
ఎస్సీ వర్గీకరణ, ఎక్సైజ్ శాఖ చట్టసవరణ బిల్లులను...
సభలో ప్రవేశపెట్టనున్న మంత్రులు డోలా, కొల్లు రవీంద్ర
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో భాగంగా...
ఏపీలో లైబ్రరీలు, ఏజెన్సీల్లోని గిరిజన గ్రామాలపై చర్చ
మైలవరం నియోజకవర్గంలో కాలుష్యం,...
చెట్లను రక్షిస్తూ విద్యుత్ తీగల ఏర్పాటుపై చర్చ
పాతపట్నం నియోజకవర్గంలో ఐసీడీఎస్ భవనం,...
చంద్రన్న బీమా కింద చెల్లింపుల మంత్రుల సమాధానాలు
కోనసీమ జిల్లాలో మురుగునీటి పారుదల వ్యవస్థ,...
ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణపై మంత్రుల సమాధానాలు
ఏపీలో విలీనం చేసిన పాఠశాలలు,...
ప్రభుత్వ అప్పులపై ప్రశ్నలకు మంత్రుల సమాధానాలు
-
Sep 22, 2025 11:43 IST
శాసనమండలిలో జీఎస్టీ సంస్కరణలపై మంత్రి పయ్యావుల ప్రకటన
శాసనమండలిలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా 20లక్షల ఉద్యోగాల కల్పన,...
NREGA సాఫ్ట్ సమాచారాన్ని పొందుపరచటంలో తప్పులపై చర్చ
కడప జిల్లాలో ముగ్గురాయి అక్రమ తవ్వకం, దీపం-2 పథకం,...
సిమెంటు ధరల్లో వ్యత్యాసం, నకిలీ ఎరువుల విక్రయంపై మంత్రుల వివరణ
ప్రైవేటు వైద్య పరీక్ష కేంద్రాలు, కబేళాలు, నాగావళి నది మీదుగా...
పూర్ణపాడు-లాబేసు వంతెన, నిరుద్యోగులకు ఆర్థిక సాయం అంశాలపై వివరణ
-
Sep 22, 2025 11:28 IST
175 నియోజకవర్గాల్లో గ్రంథాలయాల ఏర్పాటు: మంత్రి లోకేష్
వరల్డ్ క్లాస్ సెంట్రల్ లైబ్రరీ కోసం రూ.150 కోట్లు ఖర్చు అవుతుంది
గ్రంథాలయాల అభివృద్ధికి శోభా డెవలపర్స్ వాళ్లు రూ.100 కోట్లు ఇచ్చారు
24 నెలల్లో సెంట్రల్ లైబ్రరీ పూర్తి చేస్తాం: మంత్రి లోకేష్
గ్రంథాలయాల్లో అవసరమైన పుస్తకాలు కొనుగోలు చేస్తాం: లోకేష్
డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు
గ్రామ సచివాలయాల్లో రీడింగ్ రూమ్‌లు ఏర్పాటు: నారా లోకేష్
-
Sep 22, 2025 11:01 IST
మెడికల్ కాలేజీలపై కూటమి సర్కార్ తీరు దుర్మార్గం
పేద విద్యార్థులకు వైద్యవిద్య దూరమవుతోంది: బొత్స
ప్రైవేటీకరణను వెంటనే విరమించుకోవాలి: బొత్స
రాజకీయ కోణంలో మేం ఆందోళన చేయడంలేదు
ప్రజల సమస్యలపై పోరాడుతున్నాం: బొత్స
-
Sep 22, 2025 10:23 IST
ఏపీ శాసనమండలి వాయిదా
వైసీపీ నేతల ఆందోళన నడుమ సభ వాయిదా
స్పీకర్ పోడియం ఎక్కి ఆందోళన చేసిన వైసీపీ నేతలు
సభను అదుపులో ఉంచేందుకు కొద్దీ సేపటి వరకు వాయిదా వేసిన స్పీకర్
-
Sep 22, 2025 10:20 IST
నల్లకండువాలతో శాసన మండలికి వైసీపీ ఎమ్మెల్సీలు
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ సభ్యుల నినాదాలు
వైసీపీ సభ్యుల వాయిదా తీర్మానం తిరస్కరించిన మండలి చైర్మన్
పోడియం దగ్గర ప్లకార్డులతో వైసీపీ సభ్యుల ఆందోళన
-
Sep 22, 2025 10:19 IST
అమరావతి: మెడికల్ కాలేజీ అంశం మీద మరోసారి వైసీపీ నిరసన
అసెంబ్లీ బయట ఉన్న ఫైర్ స్టేషన్ నుంచి...
ఫ్లకార్టులతో నిరసన తెలుపుతూ అసెంబ్లీకి వైసీపీ మండలి సభ్యులు
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన
నల్ల కండువాలతో అసెంబ్లీకి బయల్దేరిన వైసీపీ ఎమ్మెల్సీలు
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే విరమించాలని డిమాండ్
-
Sep 22, 2025 10:18 IST
అసెంబ్లీలో నేడు వ్యవసాయ రంగంపై కీలక చర్చ
వ్యవసాయ రంగంపై కీలక ప్రకటన చేయనున్న సీఎం చంద్రబాబు
ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టనున్న మంత్రి బాలవీరాంజనేయస్వామి
ఎక్సైజ్ శాఖ చట్టసవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్న మంత్రి కొల్లు రవీంద్ర
మైదాన ప్రాంతాల్లోని గిరిజన గ్రామాలు, రాష్ట్రంలో గ్రంథాలయాలపై చర్చ
జీఎస్టీ సంస్కరణలపై మండలిలో ప్రకటన చేయనున్న ఆర్థికమంత్రి పయ్యావుల
ప్రశ్నోత్తరాల్లో పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్న మంత్రులు