Home » Andhrapradesh
కాలం చెల్లిన పౌష్టికారాన్ని గర్భిణులు, బా లింతలు, చిన్నారులకు ఎలా పంపిణీ చేస్తారని రాష్ట్ర ఫుడ్ కమిషన సభ్యురాలు గంజిమాల దేవి ఐసీడీఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక గాంధీ నగర్ పాఠశాలలో ఉన్న అంగనవాడీ కేం ద్రాన్ని ఆమె బుధవారం తనిఖీ చేశారు. అంగనవాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే పౌష్టిక ఆహారంపై తేదీ, నెల, సంవత్సరం పరిశీలించిన తర్వాతనే తీసుకోవాలని అంగనవాడీ టీచర్లకు సూచించా రు.
తిరుపతిలో ఫుడ్ కోర్ట్‌కు ఏర్పాటుకు మార్గం సుగుమం అయింది. మొత్తం ఈ ఫుడ్ కోర్ట్‌లో 40 నుంచి 50 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. దీన్ని వీలైనంత తొందరగా నిర్మింపజేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పట్లు చేస్తున్నారు. నిత్యం వేల సంఖ్యలో భక్తలు తిరుపతికి విచ్చేస్తుంటారు.
పట్టణంలోని కేశవనగర్‌లో వెలసిన అయ్యప్పస్వామి ఆలయంలో గురుస్వామి విజయ్‌కుమార్, అ య్యప్ప మాలధారుల ఆధ్వర్యంలో శనివారం స్వామికి లక్ష పుష్పార్చనను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం వేద మంత్రాలు, మం గళవాయిద్యాల నడుమ సాగింది.
అనునిత్యం తల్లిదండ్రుల కంటే ఎక్కువగా పిల్లల ఉన్నతిని కోరుకునేది ఉపాధ్యాయులు మాత్రమే నని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. పట్టణం లోని బీఎస్‌ఆర్ బాలికలు, బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం ని ర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమానికి పరిటాలశ్రీరామ్ ముఖ్యఅతిథి గా హాజరయ్యారు.
మారుతు న్న కాలానికి అనుగు ణంగా విద్యార్థు సాంకేతిక విజ్ఞానాన్ని సక్రమం గా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సూచించారు. ఆయన శుక్రవారం కదిరి పట్టణంలోని బాలికల జూని యర్ కళాశాల, నల్లచెరువు మండలంలోని ఏపీ మోడల్ స్కూల్, తనకల్లు మండలపరిధిలోని సీజీ ప్రాజెక్టు వద్ద ఉన్న గిరిజన బాలిక ల గురుకుల పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎంలలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వీధికుక్కలతో అక్కడి ప్రజలు భయపడాల్సి వస్తోంది. ఏదైనా పనిమీద బయటకు వెళితే.. తిరిగి ఇంటికి జాగ్రత్తగా వస్తామన్న నమ్మకం లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. ప్రధానంగా వీధికుక్కలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కేవలం మూడు నెలల్లోనే 106 కేసుల నమోదయ్యాయంటే ఇక్కడి పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
పరిశ్రమల సృష్టికర్త చంద్రబాబే... అని బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత అన్నారు. జిల్లాలో పర్యటించిన ఆమె మాట్లాడుతూ... చంద్రబాబు హాయంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతోందన్నారు. గత ఐదేళ్లు రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని మంత్రి అన్నారు.
బాలుడి హత్య కేసులో మిస్టరీ వీడింది. మేనమామే హంతకుడు.. అని పోలీసులు నిర్ధారించారు. కొమ్మెర హర్షవర్ధన్ అనే బాలుడిని అతని సొంత మేనమామే చంపేశాడు. జిల్లా వ్యాప్తంగా సంచలనానికి దారితీసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఈ ఏడాది దానిమ్మ రైతు పంట పండింది. మార్కెట్లో దానిమ్మకు గిట్టుబాటు ధర ఆశాజనకంగా ఉండడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. దానిమ్మ ధర లక్ష రూపాయల నుంచి రూ.1.10 లక్షల వరకు పలుకుతోంది. దీంతో దానిమ్మ సాగుచేసిన రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోకి ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగ సంఘాలను, ఎన్ఎంయూఏ, ఎంప్లాయీస్ యూనియన్లను చేర్చింది రాష్ట్ర ప్రభుత్వం.