Ananthapur News: ప్రాణం మీదకు తెచ్చిన పిల్లచేష్టలు.. తొండను విసిరిన అన్న..
ABN , Publish Date - Jan 17 , 2026 | 11:30 AM
పిల్లచేష్టలు ప్రాణం మీదకు వచ్చాయి. సరదాగా జరిగిన వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారి ఒకరిని తీవ్ర గాయాలపాలు చేసింది. సరదాగా తొండను విసరడం.. ఇంటికి నిప్పుపెట్టడం, ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు కావడం.. జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- ఇంటికి నిప్పు పెట్టిన తమ్ముడు
- ఇద్దరు చిన్నారులకు గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
గుత్తి(అనంతపురం): వరుసకు అన్నదమ్ములు. ఇద్దరూ మద్యం సేవించి మాటామాటా అనుకున్నారు. వివాదం ముదిరి, ఇంట్లోకి పెట్రోల్ బాటిల్ విసిరి నిప్పు పెట్టేదాకా వెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా మారింది. గుత్తి(Gooty) మండలం బేతాపల్లిలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన రామాంజనేయులు, శ్రీనివాసులు వరుసకు అన్నదమ్ములు అవుతారు.

కనుమ పండుగ కావడంతో మద్యం సేవించారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తరువాత రామాంజనేయులు ఓ తొండను పట్టుకువచ్చి శ్రీనివాసులు(Srinivasulu)పైకి విసిరాడు. అది శ్రీనివాసులు మెడను కొరికింది. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీనివాసులు, ప్రతిదాడికి పూనుకున్నాడు. పెట్రోలు బాటిల్‌ను రామాంజనేయులు ఇంట్లోకి విసిరి, నిప్పు అంటించాడు.

దీంతో ఇంట్లో నిద్రిస్తున్న ఉన్న రామాంజనేయులు కూతురు లక్ష్మి(10) తీవ్రంగా, కుమారుడు శివ(7) స్వల్పంగా గాయపడ్డారు. లక్ష్మికి గుత్తి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించి, అనంతపురం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
అవును.. శ్రీరాముడికి బీజేపీ సభ్యత్వం ఉంది
Read Latest Telangana News and National News