Share News

AP News: చికెన్‌ హై.. రొయ్య డౌన్‌

ABN , Publish Date - Jan 15 , 2026 | 10:12 AM

మార్కెట్లో కోడిమాంసం ధరలు రోజురోజుకూ కొండెక్కొ కూర్చుంటున్నాయి.. అయితే.. రొయ్య మాత్రం తగ్గిపోతోంది. వ్యాధులు, సీడ్‌, ఫీడ్‌ నాణ్యత లోపంతో నష్టాలు బారిన పడిన ఆక్వా రంగం విస్తీర్ణంలో దాదాపు 70శాతం తగ్గిపోయింది. వివరాలిలా ఉన్నాయి.

AP News: చికెన్‌ హై.. రొయ్య డౌన్‌

- వ్యాపారుల సిండికేట్‌ వల్లే చికెన్‌ ధరలు పైపైకి..

- ఉత్పత్తుల పెరుగుదల, కొనుగోలుదార్ల అనధికార ప్రకటనతో రొయ్య ధర ఢమాల్‌

తణుకు(అమరావతి): చికెన్‌ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో చికెన్‌(Chicken) ధర కేజీ రూ. 320 వరకు అమ్ముతున్నారు. అయితే ఒక్కోచోట ఒక్కో రకంగా ధర ఉంటోంది. దీనికి కారణం అనుకున్నంతగా వ్యాపారాలు జరగడం లేదని, దానిని దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాలను బట్టి ధరలు ఉంటున్నాయంటున్నారు.


తగ్గిన అమ్మకాలు...

సాధారణంగా చికెన్‌ అమ్మకాలు గతంతో పోల్చితే ప్రస్తుతం తణుకు పరిసర ప్రాంతాల్లో అమ్మకాలు తగ్గినట్లు చెబుతున్నారు. ప్రస్తు తం సంక్రాంతి పండుగ వల్ల కుటుంబ ఖర్చు లు, పిల్లలు బట్టలు, ఇంటి ఖర్చులు ఎక్కువ కావడం వల్ల అమ్మకాలు తగ్గినట్లు వ్యాపారు లు భావిస్తున్నారు. ఇపుడున్న ధరలు మాత్ర మే సంక్రాంతికి కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయని వ్యాపారులు అంచనా వేస్తున్నా రు.


ap1.3.jpg

చికెన్‌ ధర పెరిగినప్పటికి కొనుగోలు దారు లు సంఖ్య బాగా తగ్గిపోవడం వల్ల ఇంకా ధర లు పెరిగే అవకాశం లేదని చెబుతున్నారు. ఇంటిగ్రేటెడ్‌ కంపెనీల సిండికేట్‌ వల్ల ధరల పెరుగుదల, తగ్గుదల నిర్ణయాలు జరుగుతున్నాయి. చిన్న, సన్నకారు రైతులు నష్టాలు భరించలేక బ్రాయిలర్‌ రంగం నుంచి ఇతర రంగాలకు వెళ్ళిపోయారు. దీంతో ఉమ్మడి జిల్లాలో సుమారు 200 మంది నుంచి తగ్గు తూ ఇపుడు పదుల సంఖ్యలో ఉన్నారు. అం దువల్ల కంపెనీలు ఆధిపత్యం లోనే ధరలు ఉంటున్నాయి.


బర్డ్‌ప్లూ నుంచి బయటపడి..

బర్డ్‌ప్లూ ప్రభావంతో తీవ్రంగా పడిపోయిన కోడి మాంసం విక్రయాలు అనంతరం గణనీయంగా పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా వినియో గదారులుకు చికెన్‌ పై నమ్మకం కుదరడంతో పాటు పండగలు, శుభకార్యాలు, హోటల్‌ రంగంలో డిమాండ్‌ పెరగడం వంటి అంశాలు అమ్మకాలు పెరుగుదలకు కారణం అయ్యాయి. గత ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలో విని యోగదారులు చికెన్‌ కొనుగోలుకు వెను కాడటంతో అమ్మకాలు ఒక్కసారిగా పడిపో యిన సందర్భాలు ఉన్నాయి.


సాధారణంగా రోజుకు 10 నుంచి 11 లక్షల కిలోల వరకు ఉండే చికెన్‌ విక్రయాలు, ఆ సమయంలో 4 నుంచి 5 లక్షల కిలోలకు పడిపోయాయి. 2026లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అమ్మకాలు జోరు ఊపందుకుంది. బర్డ్‌ ఫ్లూ భయాలు తగ్గడంతో పాటు ప్రభుత్వ అవ గాహన కార్యక్రమాలు, పౌల్ట్రీ సంఘాలు ప్రచారం ఫలితంగా వినియోగదారులకు నమ్మ కం ఏర్పడి చికెన్‌ అమ్మకాలు పెరిగాయి. గత ఏడాది నష్టాలు నుంచి ఇపుడిపుడే బయట పడుతున్నారు. మరి సంక్రాంతికి అమ్మకాలు ఎలా ఉంటాయో?


మార్కెట్‌ను బట్టి అమ్మకాలు

ప్రస్తుతం మార్కెట్‌లో అమ్మకాలు చాలా వరకు తగ్గాయి. రోజు వారి అమ్మకాల్లో సగం వరకు పడిపోయాయి. ధరలు పెరగడం వల్ల కొనుగోలు దారులు తగ్గుతున్నారు. దీంతో వ్యాపారులు ఒక్కోచోట ఒక్కో ధరకు అమ్ముతు న్నారు. పది రోజుల నుంచి ధర పెరుగుతూ వస్తుంది. సంక్రాంతికి కూడా ఇవే ధరలు ఉండే అవకాశం ఉంది.

- చిలుకూరి సత్యనారాయణ, చికెన్‌ సెంటర్‌ నిర్వాహకుడు


రొయ్య ధర నేల చూపు..

ap1.jpg

ఆకివీడు: వ్యాధులు, సీడ్‌, ఫీడ్‌ నాణ్యత లోపంతో నష్టాలు బారిన పడిన ఆక్వా రంగం విస్తీర్ణంలో దాదాపు 70శాతం తగ్గిపోయింది. దీంతో వ్యాపారులు ధరలను పెంచుకుంటూ వెళ్ళారు. 100 కౌంటు రూ. 220 నుంచి రూ. 275 వరకు తీసుకెళ్ళారు. ఈ విధంగా పెంచడం ద్వారా రైతుల్లో ఆశలు రేకెత్తించారు. అయితే సంక్రాంతి పండుగ కు ఆక్వా రైతులను వ్యాపారులు కోలు కోలేని దెబ్బ తీశారు.


సంక్రాంతి సందర్భంగా పని చేసేవారికి సెలవులు ప్రకటిస్తామని, ఉత్పత్తులను కొనుగోలు చెయ్యలేమని అనధికారికంగా ప్రకటించారు. దీనికి తోడు వాతావరణంలో వచ్చిన మార్పులకు ఉత్పత్తులు పెరుగుతుండటంతో ధరలను అమాంతం రూ. 25 వరకు తగ్గించేశారు. రూ. 275 పలికిన 100 కౌంటు ధర ప్రస్తుతం రూ.250 పలుకుతున్నది. ప్రతి కౌంటుకు రూ.25 తగ్గిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పెంచినట్టే పెంచి తగ్గించేసి రైతులను నష్టాలు పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

మరింత పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

20 నుంచి వన్యప్రాణుల లెక్కింపు షురూ..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 15 , 2026 | 10:12 AM