Home » Andhrapradesh
మండలంలోని నసనకోట సమీపంలో గల తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో శుక్రవారం రాప్తాడు నియోజకవర్గ టీడీపీ సంస్థాగత కమిటీల ఎంపిక ఎమ్మెల్యే పరిటాల సునీత, ఎన్నికల పరిశీలకులు ఆదోని క్రిష్ణమ్మ, మస్తానయాదవ్, ఆదినారాయణ ఆధ్వర్యంలో చేపట్టారు.
Kakani Govardhan: అనధికార టోల్గేట్ ఏర్పాటుపై ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అవగా.. ఏ1గా కాకాణి ఉన్నారు. అలాగే మరో పది మంది అనుచరులపై కూడా కేసు నమోదు అయింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Pattabhi Slams Jagan: జగన్ పర్యటనలో ఫ్లెక్సీలు రెచ్చగొట్టే విధంగా, విపరీత నేరపూరిత ధోరణితో ఉన్నాయని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో లేకపోతే ఇంతలా బహిరంగంగా నరుకుతాం.. చంపుతాం.. తొక్కిపడేస్తాం.. అని జనాల్ని బెదిరిస్తారా అంటూ మండిపడ్డారు.
Chevireddy AP SIT: మద్యం ముడుపులతో లింక్ ఉండటంతో చెవిరెడ్డిని మద్యం కేసులో నిందితుడిగా చేర్చింది సిట్. ఇప్పటికే చెవిరెడ్డిపై వారం క్రితమే లుక్ఔట్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ క్రమంలో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు కొలంబో వెళ్తున్నారని సిట్ అధికారులు చెబుతున్నారు.
Sharmila Phone Tap: వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో షర్మిల వాయిస్ రికార్డులు అయ్యాయని, ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నకు (వైఎస్ జగన్) చేరినట్లు తెలుస్తోంది. షర్మిల ఎవరెవరితో మాట్లాడే వారో ప్రతీ ఒక్కరిపై నిఘా పెట్టినట్లు తెలియ వచ్చింది.
కొందరు ఆటోవాలాల ఆగడాలకు చెక్‌పెట్టేలా పోలీసులు క్యూఆర్ కోడ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మొదటి దశలో తిరుపతిలోని 200 ఆటోలను డిజిటలైజేషన్ చేశారు. తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణమాచ్చారి ఆధ్వర్యంలో సోమవారం పోలీసు పరేడ్ గ్రౌండులో ఆటోల డిజిటలైజేషన్ కార్యక్రమం చేపట్టారు.
CM Chandrababu: కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళపై దాడి చేసిన వారిని కఠిన శిక్షించాలని ఆదేశించారు.
NTR District TDP: ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది.
Yogandra 2025: ఈనెల 21న వైజాగ్ సముద్రం ఒడ్డున ప్రపంచ స్థాయిలోనే నిలిచిపోయేలాగా సీఎం ప్రణాళిక చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామ తెలిపారు. రెండు కోట్ల మంది యోగాకు రిజిస్టర్ అవుతారు అనుకుంటే, రెండు కోట్ల 20 లక్షల మంది రిజిస్టర్ అయ్యారన్నారు.
Deputy CM Pawan: పటాన్‌చెరులోని ఇక్రిశాట్ స్కూల్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. కుమారుడు మార్క్ శంకర్ అడ్మిషన్ కోసమే పవన్ అక్కడకు వెళ్లినట్లు సమాచారం.