AP News: అన్నమయ్య జిల్లాలో 2621 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ
ABN , Publish Date - Sep 26 , 2025 | 12:43 PM
అన్నమయ్య జిల్లాలో 2621 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉన్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులకు సరిపడే యూరియా అందుబాటులో ఉందని రైతులు అపోహలకు గురికావద్దని తెలియజేశారు.
- జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివనారాయణ
రాయచోటి: అన్నమయ్య జిల్లాలో 2621 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉన్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివనారాయణ(Shivanarayana) ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులకు సరిపడే యూరియా అందుబాటులో ఉందని రైతులు అపోహలకు గురికావద్దని తెలియజేశారు. జిల్లాలో ప్రైవేట్ డీలర్ల వద్ద 83 దుకాణాల్లో 967 మెట్రిక్ టన్నులు, 211 రైతు సేవా కేంద్రాల్లో 1654 మెట్రిక్ టన్నులు యూరియా ఉందన్నారు. అవసరమున్న చోట 24 గంటల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. యూరియా ఎక్కువ మొత్తంలో రైతులు కొనుగోలు చేయరాదని తెలియజేశారు.

సమయానుకూలంగా కావాల్సిన నిల్వలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. పంటలకు అవసరమైన మోతాదు కన్నా ఎక్కువ యూరియా వాడటం వల్ల చీడపీడలు ఎక్కువగా ఆశించి పిచికారీ ఖర్చులు పెరగడంతో పాటు దిగుబడి, నాణ్యత కూడా తగ్గుతుందన్నారు. రైతులు జీవన ఎరువులు అయిన అజిటో బ్యాక్టీరియా, అజొల్లా, రైబోజియం, మొదలగునవి వాడాలని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్..మళ్లీ తగ్గిన బంగారం, కానీ వెండి రేట్లు మాత్రం..
కాంగ్రెస్ చిల్లర వేషాలు వేస్తోంది.. ఎంపీ అర్వింద్ ఫైర్
Read Latest Telangana News and National News