AP News: పెళ్లికి వచ్చి పరలోకాలకు..
ABN , Publish Date - Sep 30 , 2025 | 01:20 PM
ఓ వివాహానికి హాజరైన కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు స్విమ్మింగ్‌లో మునిగి మృతి చెందిన సంఘటన సోమవారం మడకశిరలో జరిగింది. బంధువులు తెలిపిన వివరాల మేరకు కర్ణాటక రాష్ట్రం హాసన్‌కు చెందిన బాబ్జాన్(35) మున్వర్ బాషా(27) మడకశిరలో ఆదివారం జరిగిన తమ బంధువుల వివాహానికి హాజరయ్యారు.
- ఈత కోసం వెళ్లి ఇద్దరు కర్ణాటక యువకుల మృతి
మడకశిర(అనంతపురం): ఓ వివాహానికి హాజరైన కర్ణాటక(Karnataka) రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు స్విమ్మింగ్‌లో మునిగి మృతి చెందిన సంఘటన సోమవారం మడకశిర(Madakashira)లో జరిగింది. బంధువులు తెలిపిన వివరాల మేరకు కర్ణాటక రాష్ట్రం హాసన్‌కు చెందిన బాబ్జాన్(35) మున్వర్ బాషా(27) మడకశిరలో ఆదివారం జరిగిన తమ బంధువుల వివాహానికి హాజరయ్యారు. పెళ్లి కార్యక్రమం ముగిసిన మరుసటి రోజు సోమవారం సరదాగా సమీపంలోని అక్కంపల్లి వద్ద ఉన్న స్విమ్మింగ్ పూల్ వద్దకు ఈతకు వెళ్లారు.
అక్కడ యువకులతో పాటు బంధువులు సరదాగా దాదాపు గంటసేపు ఈత కొట్టారు. బంధువుల్లో చాలా మంది స్మిమ్మింగ్‌పూల్ నుంచి బయటకు వెళ్లిపోయినా బాబ్జాన్, మున్వర్‌బాషా అలాగే ఈత కొడుతూ ఉండిపోయారు. అయితే ఉన్నట్లుండి ఇద్దరూ మునిగిపోయారు. అక్కడే ఉన్న బంధువులు ఇది గమనించి, సరదాగా మునిగారేమోనని మిన్నకుండిపోయారు. ఐదారు నిమిషాలు గడిచినా బయటకు రాకపోవడంతో వారు స్మిమ్మంగ్‌పూల్‌లోకి దిగి ఇద్దరినీ బయటకు తెచ్చారు.

అప్పటికే కడుపు ఉబ్బి ఇద్దరూ మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకొని, మృతదేహాలను ఆస్పత్రికి తరలించినట్లు సీఐ నాగేష్ బాబు తెలిపారు. కాగా బాబ్జాన్ డ్రైవర్‌గా పని చేస్తుండగా, మున్వర్ బాషా కూలీగా పని చేసేవాడని బంధువులు తెలిపారు. బాబ్జాన్‌కు వివాహం కాగా, మున్వర్ బాషా అవివాహితుడని వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News