MAGISTRATE: ఆత్మపరిశీలనతోనే మార్పు : న్యాయాధికారి
ABN , Publish Date - Sep 26 , 2025 | 12:10 AM
ఎవరై నా ఆత్మపరిశీలన చేసుకుంటే మార్పు వస్తుం దని, మంచిమనిషిగా మనుగడ సాగించగలరని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయా ధికారి ఎన రాజశేఖర్ అన్నారు. మార్పుతోనే మంచిమనిషిగా మనుగడ సాగించగలరన్నారు.
కదిరిలీగల్, సెప్టెంబరు25(ఆంధ్రజ్యోతి): ఎవరై నా ఆత్మపరిశీలన చేసుకుంటే మార్పు వస్తుం దని, మంచిమనిషిగా మనుగడ సాగించగలరని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయా ధికారి ఎన రాజశేఖర్ అన్నారు. మార్పుతోనే మంచిమనిషిగా మనుగడ సాగించగలరన్నారు. డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి గురువారం కదిరి సబ్‌జైలు ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా న్యా యవిజ్ఞాన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం సబ్‌జైలులో ఖైదీలకు ఇస్తున్న ఆహారం, సరుకులను పరిశీలించారు.