Share News

World Bank Praises Lokesh: మంత్రి లోకేశ్‌పై ప్రశంసలు కురిపించిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు..

ABN , Publish Date - Sep 24 , 2025 | 10:03 PM

ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌పై ప్రపంచ బ్యాంక్ ప్రశంసలు కురిపించింది. ఏపీ విద్యారంగంలో లోకేశ్ తీసుకువస్తున్న వినూత్నమైన మార్పులకు గానూ ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. కాగా, ఇవాళ(బుధవారం) విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందం సమావేశమైంది.

World Bank Praises Lokesh: మంత్రి లోకేశ్‌పై ప్రశంసలు కురిపించిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు..
IT Minister Nara Lokesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌పై ప్రపంచ బ్యాంక్ ప్రశంసలు కురిపించింది. ఏపీ విద్యారంగంలో లోకేశ్ తీసుకువస్తున్న వినూత్నమైన మార్పులకు గానూ ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. కాగా, ఇవాళ(బుధవారం) విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందం సమావేశమైంది. పాల్ ల్యాబ్‌(PAL)లు, గ్యారెంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN), స్కూల్ లీడర్ షిప్ శిక్షణలు బాగా జరుగుతున్నాయని బ్యాంక్ ప్రతినిధులు లోకేశ్‌ను కొనియాడారు. ముఖ్యంగా నారా లోకేశ్ నాయకత్వంలో సాల్ట్ ప్రోగ్రామ్ భేష్ అంటూ ప్రశంసించారు. ప్రపంచ బ్యాంక్, ఏపీ సమగ్రశిక్ష ఆధ్వర్యంలో అమలవుతున్న సాల్ట్(Supporting Andhra’s Learning Transformation) ప్రోగ్రామ్ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వినూత్నంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలు దేశానికే కాకుండా దక్షిణ ఆసియా మొత్తానికే రోల్ మోడల్‌గా నిలుస్తున్నాయని కొనియాడారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్

అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు

For More AP News And Telugu News

Updated Date - Sep 24 , 2025 | 10:03 PM