Share News

Kadapa: టీడీపీ కార్పొరేటర్ల వార్నింగ్.. ఎమ్మెల్యేపై నోరు జారితే సహించేది లేదు

ABN , Publish Date - Sep 24 , 2025 | 10:37 AM

వైసీపీ కంచుకోటగా ఉన్న కడప గడ్డపై టీడీపీ జెండాను రెపరెపలాడించిన కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిపై ఎవరైనా నోరు జారితే సహించేది లేదని ఆ పార్టీ కార్పొరేటర్లు హెచ్చరించారు.

Kadapa: టీడీపీ కార్పొరేటర్ల వార్నింగ్.. ఎమ్మెల్యేపై నోరు జారితే సహించేది లేదు

కడప: వైసీపీ కంచుకోటగా ఉన్న కడప(Kadapa) గడ్డపై టీడీపీ జెండాను రెపరెపలాడించిన కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి(Kadapa MLA Madhavi Reddy), టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిపై ఎవరైనా నోరు జారితే సహించేది లేదని ఆ పార్టీ కార్పొరేటర్లు హెచ్చరించారు. మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో కార్పొరేటరు సూర్యనారాయణ, రాజశేఖర్‌రెడ్డి, చల్లా రాజశేఖర్‌, సుదర్శన్‌రెడ్డి, సుబ్బారెడ్డిలు మాట్లాడారు. ఇటీవల సింగిల్‌విండో ఛైర్మన్‌గిరిని మాధవీరెడ్డి, శ్రీనివాసరెడ్డి అండదండలతో పొందిన క్రిష్ణారెడ్డి తిన్నింటి వాసాలు లెక్కపెట్టేలా పార్టీని కడపలో భ్రష్టు పట్టించేలా వ్యవహరిస్తున్నారన్నారు.


tdp1.2.jpg

గత కొన్నేళ్లుగా టీడీపీ(TDP) అండదండలతో క్రిష్ణారెడ్డి కడపలో సాగించిన దందాలు కోకొల్లలు అన్నారు. ముఖ్యంగా రెవెన్యూశాఖను అడ్డుపెట్టుకుని సొంత బావ ఆస్తినే కాజేశారని ఆరోపించారు. అలాగే నగర పరిధిలోని ప్రకాశ్‌నగర్‌, నానాపల్లెలో స్థలాలు ఆక్రమించడమే కాకుండా కడపలో ఉన్న ప్రతి రేషన్‌షాపు డీలర్ల వద్ద లంచాలకు అలవాటుపడ్డారని ఆరోపించారు. ఇప్పటికైనా పంథా మార్చుకోకపోతే ఆయన కడపను వీడిపోయే పరిస్థితులు దాపురిస్తాయని హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భగ్గుమన్న బంగారం.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

హుస్సేన్ సాగర్‌కు పోటెత్తిన వరద.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..

Read Latest Telangana News and National News

Updated Date - Sep 24 , 2025 | 10:41 AM