Home » Andhrajyothy Breaking News
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల్లోపు నిమజ్జనం పూర్తి అయ్యేలా ఉత్సవ కమిటీ సభ్యులు ప్రణాళిక చేశారు.
పంట నష్టాల అంచనాలు తక్షణమే పూర్తి చేయాలని ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలపై వెంటనే క్షేత్రస్థాయి సర్వే చేపట్టాలని సూచించారు.
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల్లోపు నిమజ్జనం పూర్తయ్యేలా ఉత్సవ కమిటీ సభ్యులు ప్రణాళిక చేశారు.
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనాలకు తెలంగాణ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 20 వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జలాశయాలకు వరద ప్రవాహం పెరిగింది. వరద ఉద్ధృతి పెరగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలో ప్రజలు జలాశయాల వద్దకు వెళ్లకూడదని సూచించారు.
ధాన్యం సేకరణ కేవలం వ్యాపార లావాదేవీ కాదని.. రైతులకు న్యాయం చేసే పవిత్ర బాధ్యత అని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ లంబోదరుడి లడ్డూ రూ.39 లక్షలకు పలికింది. సామ ప్రణీత్‌రెడ్డి ఈ లడ్డూను కైవసం చేసుకున్నారు.
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. బడా గణేశ్‌ను లిఫ్ట్ చేసే క్రేన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది.
దానం నాగేందర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. దానం నాగేందర్ తరఫున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
తెలంగాణలో భూ అక్రమాలపై విచారణ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భూముల అక్రమాలు, అవకతవకలపై విచారణకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ మేరకు జీవో నంబర్ -134ను ప్రభుత్వం జారీ చేసింది.