ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం ప్రత్యక్ష ప్రసారం
ABN, Publish Date - Sep 25 , 2026 | 10:36 AM
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల్లోపు నిమజ్జనం పూర్తి అయ్యేలా ఉత్సవ కమిటీ సభ్యులు ప్రణాళిక చేశారు.
ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 25 (ఆంధ్రజ్యోతి): ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఈరోజు (శుక్రవారం) ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల్లోపు నిమజ్జనం పూర్తి అయ్యేలా ఉత్సవ కమిటీ సభ్యులు ప్రణాళిక చేశారు. బడా గణపతి శోభాయాత్రకు విజయవాడ నుంచి భారీ టస్కర్‌ను తీసుకువచ్చారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లోని ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నంబర్ - 4, 5 దగ్గర వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. డీజే వాడకుండా.. సన్నాయి మేళాల మధ్యనే ఖైరతాబాద్ లంబోదరుడిని నిమజ్జనం చేయనున్నారు. గణనాథుడిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
Updated at - Sep 25 , 2026 | 12:49 PM