Home » Andhrajyothy Breaking News
భారతదేశపు మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన సేవలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సర్మించుకున్నారు.
మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూర్ మండలంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమపేరుతో బాలికను వంచించి జాటోత్ ప్రవీణ్ అనే యువకుడు గర్భవతిని చేశాడు.
మైలవరం నియోజకవర్గంలో కూటమి సాధించిన స్థానిక సంస్థల ఎన్నికల విజయాలు ప్రజల నమ్మకానికి నిదర్శనమని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. మైలవరంలో కూటమి విజయోత్సవ సంబరాలు, కార్యకర్తల కష్టానికి ప్రజల పట్టాభిషేకమని పేర్కొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి రూ. 5 లక్షల ఇందిరమ్మ బీమా పథకాన్ని 19వ తేదీన సిద్దిపేట వేదికగా ప్రారంభిస్తారని తెలంగాణ మంత్రి వివేక్ వెంకట్ స్వామి పేర్కొన్నారు. ఈ పథకాన్ని అర్హులకు ఇస్తామని స్పష్టం చేశారు.
కల్లం మోడ్రన్ రైస్ మిల్స్ కేసులో ఈడీ అధికారులు చర్యలు చేపట్టారు. కల్లం పేరిరెడ్డి, కుటుంబ సభ్యులు, అనుచరుల ఆస్తులపై ఈడీ కొరడా ఝుళిపించారు. రూ.18.33 కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్.. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి పేరు చెడగొడుతున్నారని ధ్వజమెత్తారు.
రైతులను ఆదుకునేందుకు బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. అధికారులకు దిశానిర్దేశం చేశారు. కరవు ప్రభావిత ప్రాంతాల్లో పంట రుణాలను రీషెడ్యూలింగ్ చేయాలని ఆజ్ఞాపించారు.
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఇరాన్ అణ్వాయుధ తయారీ సామర్థ్యాన్ని 85 శాతం మేర ఇప్పటికే నిర్వీర్యం చేశామని, చర్చలు విఫలమైతే మిగిలిన 15 శాతాన్ని కూడా నామరూపాలు లేకుండా చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
విజయవాడ ఉగ్రవాద మూలాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై ఇద్దరు నిందితులు విడుదలయ్యారు.
సామాజిక భద్రత కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది.