Home » Andhra Pradesh
దేశంలో ఎక్కడా కూడా పింఛన్లకు రూ.6 వేలు ఇచ్చే ప్రభుత్వం లేదని.. ఒక్క ఏపీలో మాత్రమే ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రూ.3 వేల పింఛన్ను రూ.6వేలకు పెంచామని గుర్తుచేశారు.
రెండోవిడత భూసేకరణ కోసం గ్రామాల్లో ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. డిసెంబర్ 5వ తేదీ తర్వాత రెండో విడత భూ సేకరణ ప్రారంభవుతోందని వివరించారు. భూసమీకరణలో అనుభవం ఉన్న అధికారులను నియమించాలని కలెక్టర్లను ఆదేశించామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు ఈ నెల 23వ తేదీన జరగనున్నాయి. ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం ఎన్నికల నిర్వహణపై అప్సా అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన కార్యవర్గం బుధవారం సమావేశమైంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకారెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరపాలని వివేకా కుమార్తై సిబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై బుధవారం విచారణ జరిగింది.
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే మాల తీయడానికి శివస్వాములు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో శివస్వాములకు మాత్రమే స్పర్శ దర్శనం కల్పిస్తూ ఆలయ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు.
జఠిలమైన వ్యవసాయ సమస్య పరిష్కరించడానికి ఐదు సూత్రాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.. ఇందులో భాగంగానే నీటి భద్రత కల్పించాలని భావించామని పేర్కొన్నారు. గంగా, కావేరి నదులను అనుసంధానం చేయాలని నిర్ణయించామని తెలిపారు.
పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కలకలం సృష్టిస్తుంది. ఈ లక్షణాలతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. అలానే మరొకరు చికిత్స పొందుతున్నారు. ముప్పాళ్ల మండలం రుద్రవరం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని జ్యోతి , రాజుపాలెంకు చెందిన సాలమ్మ స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మృతి చెందారు.
ఒక అపనింద పదో తరగతి చదువుతున్న బాలుడి ప్రాణం తీసింది. తమ బిడ్డ విగత జీవిగా ఉండటం చూసి.. ఆ బాలుడి తల్లిదండ్రులు భోరున విలపించారు. ఈ ఘటన కృష్ణా జిల్లా పామర్రులో చోటుచేసుకుంది.
సీఎం చంద్రబాబు రాకకు నల్లజర్ల ముస్తాబైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతన్న మీకోసం కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.
నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో కోట సత్తెమ్మ తిరునాళ్లు 4వ తేదీ గురువారం నుంచి 8వ తేదీ సోమవారం వరకు ఘనంగా నిర్వహిస్తామని ఫౌం డర్ ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవిశంకర్, దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ వి.హరి సూర్యప్రకాష్ తెలిపారు.