BORE WELL: అలంకారప్రాయంగా చేతి పంపులు
ABN , Publish Date - Feb 19 , 2026 | 11:34 PM
మండల పరిధిలోని పలు గ్రామాల్లో తాగునీటి చేతి పంపులు అలంకారప్రా యంగా మారాయి. మర మ్మతులకు నోచుకోక ని రుపయోగంగా ఉన్నాయి. పలుచోట్ల ఉపయోగంలో ఉన్నవి కూడా సంబంధిత అధికారుల పర్య వేక్షణ క రువై తుప్పు పడుతున్నా యి. అనేక గ్రామాల్లో బోర్లు పాడైపోయాయి.
-చెడిపోయిన వాటి మరమ్మతులపై నిర్లక్ష్యం
-నిధులు లేవని సమాధానం ఫ గ్రామాల్లో మొదలైన నీటి ఎద్దడి
బొమ్మనహాళ్, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని పలు గ్రామాల్లో తాగునీటి చేతి పంపులు అలంకారప్రా యంగా మారాయి. మర మ్మతులకు నోచుకోక ని రుపయోగంగా ఉన్నాయి. పలుచోట్ల ఉపయోగంలో ఉన్నవి కూడా సంబంధిత అధికారుల పర్య వేక్షణ క రువై తుప్పు పడుతున్నా యి. అనేక గ్రామాల్లో బోర్లు పాడైపోయాయి. శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం నుంచి కూడా గ్రామాలకు సక్రమంగా నీటి సరఫరా చేయడం లేదు తాగునీటి కోసం శుద్ధ జల కేంద్రాలను ఆశ్రయించినా, ఇతర అవసరాలకు స్థానికంగా ఉన్న బోర్ల నీరే ఆధారం. వాటి నిర్వహణ లేక పోవడంతో గ్రామాల్లో నీటి సమస్యలు తప్పడం లేదు.
మండల వ్యాప్తం గా 165 వరకు తాగునీటి చేతిపంపులుండగా, వాటిలి దాదాపు 45కు పైగా పనిచేయడంలేదు. మండలంలోని ఉద్ధేహాళ్, గోవిందవాడ, శింగానహళ్లి తదితర గ్రామాల్లో చేతిబోర్లు పనిచేయడంలేదు. మరమ్మ తులు చేపట్టాలంటే అధికారులు నిధుల కొరత చూపుతున్నారు. వేసవి ఎద్దడిని అధిగమించడంలో బోర్లు కీలకం. వేసవి ప్రారంభం అవుతు న్నా వాటి మరమ్మతుల పట్ట నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తు న్నాయి. బోర్లు అన్ని బాగున్నట్లు అధికారులు లెక్క చెబుతున్నారు. కాగా మరమ్మతులు చేపట్టకపోవడంతో గ్రామాల్లో తాగునీటి ఇబ్బం దులు తప్పడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చర్యలు తీసుకుంటున్నాం- శీన నాయక్, ఏఈఈ, ఆర్‌డబ్ల్యూఎస్, బొమ్మనహాళ్
మండలంలో చాలావరకు బోర్లు బాగుచేశాం. మండలంలో 10 బోర్లు మాత్రమే పని చేయడంలేదు వాటిని మరమ్మతులు చేస్తాం. ఇంకా ఎక్కడైనా పని చేయనివి ఉంటే చర్యలు చేపడతాం. వేసవిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....