Share News

HOMAM: కసాపురంలో మన్యుసూక్త హోమం

ABN , Publish Date - Feb 19 , 2026 | 11:39 PM

కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో పూర్వాభాద్ర నక్షత్రం సందర్భంగా గురువారం మన్యుసూక్త హోమం నిర్వహించారు. ఆలయంలోని యాగ శాలలో ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తిని కొలువుదీర్చారు.

HOMAM: కసాపురంలో మన్యుసూక్త హోమం
Priests performing Homa in Kasapuram

గుంతకల్లుటౌన, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో పూర్వాభాద్ర నక్షత్రం సందర్భంగా గురువారం మన్యుసూక్త హోమం నిర్వహించారు. ఆలయంలోని యాగ శాలలో ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తిని కొలువుదీర్చారు. ఉత్సవ మూర్తికి తిరుమంజన స్నపన, మన్యుసూక్త హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో ఆలయ ఈఓ ఎం విజయరాజు, వేదపండితులు, అర్చకులు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఘనంగా చండీహోమం

కణేకల్లు: మండలంలోని కళేకుర్తి గ్రామంలోని మారమ్మదేవి విగ్ర హ పునః ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా గురువారం చండీహో మాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయమే ప్రాతఃకాల పూజ, దీక్షాహోమం చేసి సాయంత్రం చండీయాగం నిర్వహించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 19 , 2026 | 11:39 PM