Share News

SHIVAJI: ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి

ABN , Publish Date - Feb 19 , 2026 | 11:43 PM

ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతిని గురువారం ఘనంగా నిర్వ హించారు. ఆరె కటిక కులస్థులు, టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఆయ న చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు.

SHIVAJI: ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి
Leaders of Aare Katika community taking Shivaji statue in Kanekallu

(ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌)

ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతిని గురువారం ఘనంగా నిర్వ హించారు. ఆరె కటిక కులస్థులు, టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఆయ న చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. గుంతకల్లు పట్టణంలో ఆరె కటిక సంఘం ఆధ్వర్యంలో శివాజీ ఉత్సవ మూర్తితో ర్యాలీ నిర్వహించారు. ఉరవకొండలో శివాజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుత్తి పట్టణంలో హైందవ ఐక్య సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, ఆయన చిత్రప టం వద్ద నివాళులర్పించారు.


స్ధానిక ఓ పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మధుసూదన గుప్త, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచార కర్త నరేష్‌ పాల్గొన్ని మాట్లాడారు.

- రాయదుర్గం పట్టణంలో అరెకటిక సంక్షేమ సంఘమ్‌ ఆధ్వర్యం లో శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. ఆయన చిత్రపటంతో శోభాయాత్ర నిర్వహించారు. అదేవిధంగా భావన ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. కణేకల్లు ఆరె కటిక కులస్థులు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ట్రాక్టర్‌లో ఊరేగించారు. బెళుగుప్ప గ్రామ సచివాలయంలో నిర్వహించిన శివాజీ జయంతి వేడుకల్లో సింగిల్‌ విండో అధ్యక్షుడు కంచి రాముడు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కుందుర్పిలోని రామస్వా మి ఆలయం ఎదుట శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళి అర్పించారు. తాడిపత్రి పట్టణం, మండలకేంద్రమైన యాడికిలో అర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ నాయకులు శివాజీ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

Updated Date - Feb 19 , 2026 | 11:43 PM