Home » Ananthapuram
ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి వారికి ఘన స్వాగతం పలికారు.
అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో కూటమి ప్రభుత్వం రేపు భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి పార్టీ పేరుతో నిర్వహిస్తున్న సభ కావడంతో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.
తాడిపత్రిలో పొలిటికల్ హీట్ నెలకొంది. నేడు వైసీపీ కీలక నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లనుండటంతో టెన్షన్ వాతవారణం నెలకొంది.
‘కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతాం.. విద్యాప్రమాణాలు మెరుగుపరుస్తాం..’ అంటూ ప్రభుత్వ పెద్దలు పదేపదే గొప్పలు చెబుతుంటారు. ఆ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యావ్యవస్థ అభివృద్ధి కోసం వివిధ పథకాలు తీసుకొచ్చి ఏటా రూ.కోట్లు ఖర్చు పెడుతున్నాయి. పుస్తకాల నుంచి యూనిఫాం, చివరకు పౌష్టికాహారం వరకు సర్కారు బడుల్లో చదువుతున్న పిల్లలకు ఉచితంగా ...
పిల్లలకు పంపిణీ చేసే పౌష్టికాహారంలో ఐసీడీఎస్ అధికారులు, ఏజెన్సీ నిర్వాహకులు కక్కుర్తికి పాల్పడ్డారని తెలుస్తోంది. శింగనమల ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో చిన్నారులకు పంపిణీ చేసే బాలామృతం బ్యాగులు 484 మాయమయ్యాయి. ప్రాజ్టెక్‌కు బ్యాగులు వచ్చినా వాటిని చిన్నారులకు పంపిణీ చేయకుండా స్వాహా చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
మాజీ ఎమ్మె్ల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టేందుకు హైకోర్టు అనుమతివ్వడంతో.. మరోసారి కేతిరెడ్డి, జేసీ కుటుంబాల మధ్య వివాదం రాజుకుంది. దమ్ముంటే తాడిపత్రికి రా... తేల్చుకుందాం టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి పెద్దారెడ్డికి సవాల్ విసిరారు.
తాడిపత్రిలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఓ వైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంట్రీ.. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపడుతుండటంతో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
విపరీతంగా పెరిగిన గుర్రపు డెక్కను చూసి ఇదేదో చిన్న పంట కాలువ నుకుంటే తప్పులో కాలేసినట్లే. అనంత నగరంలోనే పెద్దదైన నడిమివంక. రజకనగర్‌లో ఇలా కుంచించుకపోయి, గుర్రపు డెక్క పెరిగిపోయి, పూడిక పేరుకుపోయి నీరు ముందుకు కదిలే అవకాశమే కనిపించట్లేదు. ఈ వంక ...
డ్వాక్రా సంఘాల సొమ్మును కాజేసి ఏళ్లవుతున్నా.. అధికారులు చోద్యం చూస్తున్నారు. నేటికీ బాధ్యులపై చర్యల్లేవు, రికవరీ కూడా చేయలేదు. బాధిత మహిళలు మాత్రం ఏళ్లుగా ఉన్నతాధికారులు, పోలీసు స్టేషన చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. వారి ఖాతాలో ఎలాంటి సొమ్ము జమైనా ఇవ్వట్లేదు. ...
జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం వాన దంచికొట్టింది. అనంతపురం, పుట్లూరు మండలాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. రాయదుర్గం, నార్పల, తాడిపత్రి, బొమ్మనహాళ్, బెళుగుప్ప తదితర మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. జిల్లాలోని 7 మండలాల్లో గురువారం రాత్రి వర్షం పడింది. పుట్లూరు 4.8, అనంతపురం 4.2, విడపనకల్లు 4.0, రాప్తాడు 3.4, ఉరవకొండ 2.0, గుత్తి 1.8, బొమ్మనహాళ్‌లో 1.2 మీ.మీ వర్షపాతం ..