Ananthapuram News: బస్సు ఎక్కడానికి వెళ్తూ...
ABN , Publish Date - Jan 09 , 2026 | 11:21 AM
బస్సు ఎక్కడానికి వెళుతూ కిందపడిపోయి ఓ యువకుడు మృతిచెందిన విషాద సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. గాండ్ల పురుషోత్తం అనే యువకుడు బస్సు ఎక్కడానికి వెళుతూ కిందపడిపోయాడు. అనంతరం కొద్దిసేపటికే ఊపిరాడక అతను మృతిచెందాడు.
- కిందపడి యువకుడి మృతి
కొత్తచెరువు(అనంతపురం): మండల కేంద్రంలోని బుక్కపట్నం రహదారిలో గురువారం బస్సు ఎక్కడా నికి వెళ్తూ పొరపాటున కిందపడి నల్లమాడ(Nallamadu) మండలం రెడ్డిపల్లికి చెందిన గాండ్ల పురుషోత్తం(33) మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. రెడ్డిపల్లికి చెందిన పురుషోత్తం పుట్టపర్తి ఎస్‌బీఐ ఏటీఎం సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతడు బుధవారం రాత్రి విధులు ముగించకుని గురువారం ఉదయం తన స్వగ్రామం రెడ్డిపల్లికి వెళ్లేందుకు పుట్టపర్తి నుంచి కొత్తచెరువుకు వచ్చాడు.
అక్కడ తన లగేజీలో ఒక దానిని కదిరి బస్సులో ఉంచి, మరొకటి తెచ్చేలోగా బస్సు ముందుకు వెళ్లింది. దీంతో అతడు లగేజీని తీసుకుని బస్సు ఎక్కడానికి పరుగెడుతుండగా కాలు స్లిప్ అయి కిందపడ్డాడు. కిందపడిపోయిన పురుషోత్తంను స్థానికులు పక్కకు తీసుకొచ్చి ఫిట్స్ వచ్చాయేమోనని ప్రథమ చికిత్సలు చేశారు. అయితే కొద్దిసేపటికి శ్వాస తీసుకోకపోవడంతో మృతిచెందినట్టు స్థానికులు భావించారు. 108 వాహనం సిబ్బంది వచ్చి పరీక్షించి, మృతిచెందినట్టు తెలిపా రు. ప్రయాణికులు అంతా ఎక్కే వరకు వేచి చూడకుండా బస్సు ముందుకు కదలడంతోనే నిండుప్రాణం పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
అదేవిధంగా కొత్తచెరువులోని నాలుగురోడ్ల కూడలిలో, బుక్కపట్నం రహదారిలోని డివైడర్లపై తోపుడు బండ్లు, చిరు వ్యాపారాలు చేసుకుం టూ ఉండడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని, దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు, ప్రజలు వాపోతున్నారు. పోలీసులకు ఎన్నిసార్లు తెలియజేసిన పట్టించు కోలేదని స్థానికులు మండిపడుతున్నారు. ప్రాణాలు పోతే కానీ అధికారులు స్పందించరని పలువురు విమర్శిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
ఇక షోరూం వద్దే వాహన రిజిస్ట్రేషన్
శాప్‌కు 60.76 కోట్లు.. కేంద్ర క్రీడా శాఖ కేటాయింపు
Read Latest Telangana News and National News