Home » Ananthapuram
బావ మీద ఉన్న కోపాన్ని తన మేనల్లుడిపై చూపించాడో దుర్మార్గుడు. పసివాడిని కూడా చూడకుండా గొంతు నులిమి చంపేశాడు. ప్రేమ నటించి, మేనల్లుడు ఐదు సంవత్సాల హర్షవర్ధన్‌ను దారుణంగా హతమార్చాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన ఓ కుర్రాడు అంతర్జాతీయ చెస్ టోర్నీలో సత్తాచాటి అదుర్స్ అనిపించుకుంటున్నాడు. ఫణికుమార్, దీప్తి దంపతుల కుమారుడైన సహృద్ ఏడో తరగతి చదువుతున్నాడు. అయితే..అంతర్జాతీయ చెస్ టోర్నీలో ప్రతిభను చాటాడు.
తగిన ఆధారాలు చూపించి పాపను తీసుకెళ్లాలని ఐసీడీఎస్ పీడీ అరుణకుమారి కోరారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ... జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని శిశుగృహలో సంరక్షణ పొందుతున్న 60రోజుల చిన్నారిని తగిన ఆధారాలు సమర్పించి తీసుకెళ్లవచ్చునని కోరారు.
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రైతులకు ఓ సూచన చేశారు. రైతులంతా ఒకేసారి ఒకే రకం పంట సాగుచేస్తే గిట్టుబాటు ధరలేక నష్టాలు వస్తున్నాయని, కాబట్టి ఒకే రకం పంట కాకుండా మర్పిడి చేసుకోవాలని ఆమె సూచించారు.
అనంతపురంలో వైసీపీ నేత సత్యనారాయణ రెడ్డి హల్‌చల్ చేశారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్‌ను ధ్వంసం చేయించారు. ఆస్పత్రిని అప్పగించాలని దాదాపు 30 మంది రౌడీమూకలతో బాధితురాలు, మహిళ లాయర్ శ్రీలత బెదిరించినట్లు తెలుస్తోంది.
నిస్వార్థ సేవలకు సత్యసాయి సేవాదళ్ నిదర్శనమని కేంద్ర మంత్రి నితిన గడ్కరీ, సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యులు, ప్రతినిధులు కొనియాడారు. సత్యసాయి బోధనలే వారిని సేవామార్గంలో నడిపిస్తున్నాయని అన్నారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంతు మందిరంలో గురువారం శ్రీసత్యసాయి 11వ అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. సెంట్రల్ ట్రస్ట్ ప్రతినిధులు రత్నాకర్, చక్రవర్తి జ్యోతి ప్రజ్వలన ..
పుట్టపర్తి/టౌన/రూరల్, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): సత్యసాయి శత జయంతి ఉత్సవాలు పుట్టపర్తిలో వైభవంగా సాగుతున్నాయి. హిల్‌వ్యూ స్టేడియంతో బుధవారం నిర్వహించిన వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన కల్యాణ్, కేంద్ర మంత్రులు భూపతి రాజు...
కర్ణాటక సరిహద్దులోనే మండలం ఉంది. కర్ణాటకలో మద్యంతాగి.. మండలానికి చెందిన యువకులు ఊగుతున్నారు. సరిహద్దు దాటి అవతలికి వెల్లి పూటుగా మద్యం తాగుతున్నారు. అదే మత్తులో ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతూ మండలంలోకి వస్తున్నారు.
దంపతుల మధ్య సమస్య పరిష్కరించడానికి కులపెద్దలు పంచాయితీ చేస్తారట. అందుకు ఏకంగా రూ.10లక్షలు, పది తులాల బంగారం ఇవ్వాలని తీర్మాణం చేశారు. ఈ ఘటన గుంతకల్లులో వెలుగుచూసింది. బాధితురాలు తన సమస్యను చెప్పుకోవడానికి సోమవారం కలెక్టరేట్‌కు వచ్చింది.
ఉప్పర్లపల్లి గ్రామానికి చెందిన ప్రమీల (45) అవమానభారంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఉప్పర్లపల్లి గ్రామానికి చెందిన ముత్యాలు భార్య ప్రమీల అదే గ్రామానికి చెందిన వడ్డే నెట్టికంటికి ఐదేళ్ల కిందట రూ.20వేలు వడ్డీకి అప్పు ఇచ్చింది.