Share News

Ananthapur News: భం.. అఖండ.. అనంతలో ఇద్దరు ఎమ్మెల్యేల ర్యాలీ

ABN , Publish Date - Dec 12 , 2025 | 10:51 AM

జిల్లా కేంద్రం అనంతపురంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ర్యాలీ నిర్వహించారు. అఖండ-2 సినిమా విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోయిన సందర్భాన్ని పురష్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. అటు బాలయ్య అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Ananthapur News: భం.. అఖండ.. అనంతలో ఇద్దరు ఎమ్మెల్యేల ర్యాలీ

- మిన్నంటిన బాలయ్య అభిమానుల సంబరాలు

ఆంధ్రజ్యోతి, అనంతపురం: అఖండ-2 సినిమా విడుదలకు సిద్ధం కావడంతో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) అభిమానుల ఆనందం ఆకాశాన్ని తాకింది. ఎమ్మెల్యేలు సైతం ‘భం అఖండ..’ అంటూ వీరాభిమానాన్ని చాటుకున్నారు. అనంత వీధుల్లో గురువారం రాత్రి ఆటోలు, బుల్లెట్‌లు నడిపారు. అభిమానులతో కలసి ర్యాలీలు నిర్వహించారు. టపాసులు పేల్చారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ బైక్‌ ర్యాలీలో, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు ఆటో ర్యాలీలో పాల్గొని అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేశారు.


pandu1.2.jpg

దగ్గుపాటి తన కార్యాలయం నుంచి గౌరీ థీయేటర్‌ వరకు, ఎంఎస్‌ రాజు రాంనగర్‌ నుంచి త్రివేణి థియేటర్‌ వరకూ ర్యాలీలు నిర్వహించారు. బాలయ్య ప్లకార్డులు, అఖండ సినిమా జెండాలు ప్రదర్శిస్తూ సందడి చేశారు. తర్వాత ఎమ్మెల్యేలు ఇద్దరూ గౌరీ థీయేటర్‌ శివలింగానికి అభిషేకం చేశారు. ఎన్‌బీకే ఫ్యాన్స్‌ నాయకుడు గౌస్‌ మొద్దీన్‌ ఆధ్వర్యంలో బాలయ్య చిత్రపటానికి హారతులు పట్టారు. డ్రమ్స్‌ వాయిస్తూ సంబరాలు చేసుకున్నారు. బెనిఫిట్‌ షో గురువారం రాత్రి, రిలీజ్‌ శుక్రవారం ఉండటంతో థియేటర్ల వద్ద బాలయ్య అభిమానులు, టీడీపీ నాయకుల సందడి నెలకొంది. ర్యాలీలో ఎన్‌బీకే హెల్పింగ్‌ హ్యాండ్స్‌ జగన్‌, మదమంచి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


panddu1,2.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..

విషాదం.. లోయలో పడిపోయిన ట్రావెల్ బస్సు..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 12 , 2025 | 10:51 AM