Municipal Chairman Post: మరో మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ కైవసం
ABN , Publish Date - Dec 11 , 2025 | 11:43 AM
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నిక అయ్యారు 15వ వార్డు కౌన్సిలర్ తలారి గౌతమి. ఈ నేపథ్యంలో తెలుగు తుమ్ముళ్లు సంబురాలు చేసుకుంటున్నారు.
అనంతపురం, డిసెంబరు11(ఆంధ్రజ్యోతి): కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని(Kalyanadurgam Municipal Chairman Post) తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నిక అయ్యారు 15వ వార్డు కౌన్సిలర్ తలారి గౌతమి. అయితే, ఎక్స్ అఫీషియో హోదాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎంపీ అంబికా లక్షీనారాయణ, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు. కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ దక్కించుకోవడంతో తెలుగు తుమ్ముళ్లు సంబురాలు చేసుకుంటున్నారు. టపాసుల మోతతో కళ్యాణదుర్గం సందడిగా మారింది. ఈ క్రమంలో తలారి గౌతమికి టీడీపీ హై కమాండ్ శుభాకాంక్షలు తెలిపింది.
కాగా, కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఇవాళ(గురువారం) జరిగింది. మున్సిపల్ చైర్మన్ తలారి రాజ్ కుమార్‌ను ఏపీ ప్రభుత్వం తొలగించడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉన్న కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో టీడీపీకి 12 మంది కౌన్సిలర్లు ఉండగా... వైసీపీకి 12 మంది కౌన్సిలర్ల బలం ఉంది. ఎంపీ, ఎమ్మెల్యే ఎక్స్అఫీషీయో ఓటుతో కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ దక్కించుకుంది.
రామగిరి ఎంపీపీ ఎన్నికపై ఉత్కంఠ..
మరోవైపు.. రామగిరి ఎంపీపీ ఎన్నిక తీవ్ర ఉత్కంఠతగా కొనసాగింది. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది రామగిరి ఎంపీపీ ఎన్నిక. నాలుగోసారి రామగిరి ఎంపీపీ ఎన్నిక ఈరోజు (గురువారం) జరిగింది. ఇప్పటికే రామగిరి ఎంపీపీ ఎన్నికను వైసీపీ బహిష్కరించిన విషయం తెలిసిందే. మూడుసార్లు కోరం లేక రామగిరి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది.
రామగిరి ఎంపీపీగా కుంటిమద్ది సాయిలీల ఎన్నిక..
రామగిరి ఎంపీపీగా కుంటిమద్ది సాయిలీల ఎన్నికయ్యారు. కాగా ఇప్పటికే సాయిలీల ఎంపీటీసీగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే నలుగురు ఎంపీటీసీలు ఎంపీడీవో కార్యాలయానికి వచ్చారు. మండలంలో పదిమంది ఎంపీటీసీలు ఉండగా ఒకరు చనిపోవడంతో ఎంపీపీ ఎన్నికకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నలుగురు ఎంపీటీసీలు ఎన్నికకు హాజరు కావడంతో రామగిరి ఎంపీపీగా సాయిలీలను ఎన్నుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గోల్డీ హైదర్‌తో మంత్రి లోకేశ్ కీలక భేటీ.. పెట్టుబడులపై చర్చ
ఇంద్రకీలాద్రిలో భవాని దీక్ష విరమణలు ప్రారంభం.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ
Read Latest AP News And Telugu News