Share News

Ananthapuram News: బంగారు ఆభరణాల్లో లక్క.. తూకం ఎక్కువగా చూపించి..

ABN , Publish Date - Dec 13 , 2025 | 01:42 PM

బంగారు ఆభరణాల్లో లక్క పెట్టి.. తూకం ఎక్కువగా చూపించి బ్యాంకుల నుంచి రుణం పొందిన విషయం అనంతపురం జిల్లా ఓబుళదేవరచెరువులో వెలుగులోకి వచ్చింది. అయితే.. ఈ వ్యవహారం మొత్తం బట్టబయలు కావడంతో పోలీసులు కేసునమోదు చేశారు.

Ananthapuram News: బంగారు ఆభరణాల్లో లక్క.. తూకం ఎక్కువగా చూపించి..

ఓబుళదేవరచెరువు(అనంతపురం): మండల కేంద్రంలోని స్టేట్‌ బ్యాంకులో బంగారు ఆభరణాల్లో లక్క ఉంచి, తూకం ఎక్కువగా చూపించి అధిక మొత్తంలో రుణం తీసుకుని, మోసం చేసిన కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో శుక్రవారం ఆయన వివరాలు వెల్లడించారు. డబురువారిపల్లికి చెందిన అందె జయప్పతోపాటు అదే ఊరికి చెందిన ముస్తాక్‌ బాషా, రఘుకుమార్‌, నగేష్‌ కొన్నేళ్ల క్రితం బెంగళూరు(Bengaluru)కు వెళ్లి స్థిరపడ్డారు. తమ వద్దనున్న తక్కువ బంగారంతో ఎక్కువ రుణం పొందాలనుకున్నారు. ఆభరణాల్లో లక్కను ఉంచి తూకం ఎక్కువ వచ్చేలా ఎత్తుగడ వేశారు.


pandu5.3.jpg

అలా.. గోరంట్లలోని ఎస్‌బీఐ శాఖలో తాకట్టు పెట్టి అధిక మొత్తంలో రుణం తీసుకున్నారు. అది కూడా గ్రామానికి చెందిన రైతుల పేర్లతో తీసుకున్నారు. రెండోసారి బంగారు రుణం కోసం వెళ్లగా.. అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు పరిశీలించారు. దీంతో మోసం వెలుగుచూసింది. దీనిపై బ్యాంకు మేనేజర్‌ యేసుదాసు.. పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా శుక్రవారం సాయంత్రం మండలంలోని మహమ్మదాబాద్‌ క్రాస్‌లో నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. వారి నుంచి కారు స్వాధీనం చేసుకున్నామన్నారు.


గోరంట్లలో ముగ్గురు..

గోరంట్ల: రైతుల ముసుగులో నకిలీ బంగారాన్ని తాకట్టుపెట్టి బ్యాంకర్లను మోసం చేసిన కేసులో వడ్డె శంకరప్ప, కర్ణాటకకు చెందిన శంకర్‌, నంజుండప్పను అరెస్టు చేసినట్లు సీఐ శేఖర్‌ తెలిపారు. గోరంట్ల స్టేట్‌బ్యాంకులో ఈనెల 9న గోరంట్లకు చెందిన శంకరప్ప ద్వారా కర్ణాటకలోని యల్హంకకు చెందిన శంకర్‌, నంజుండప్ప 16 తులాల నకిలీ బంగారం తాకట్టు పెట్టాలని ప్రయత్నించారు. బ్యాంకర్లు పసిగట్టి పోలీసులకు సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే.బ్యాంకు మేనేజర్‌ ఫిర్యాదు మేరకు వారిపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. మండలంలోని జాతీయ రహదారిపై మిషన్‌ తండా ఆర్‌సీబీ హోటల్‌ వద్ద నిందితులను గురువారం రాత్రి అరెస్టు చేసినట్లు సీఐ శేఖర్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చదవడం లేదని..బాలుడిని అట్లకాడతో కాల్చిన ట్యూషన్‌ టీచర్‌

మా ఊరికి రోడ్డు వేయరూ..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 13 , 2025 | 01:42 PM