Share News

Students incident: అనంతపురంలో దారుణం.. విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Dec 11 , 2025 | 01:03 PM

అనంతపురం జిల్లాలోని కేఎస్ఆర్ జూనియర్ కాలేజీలో నలుగురు బాలికలు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.నలుగురు విద్యార్థినులు వాస్మోల్ తాగి ఆత్మహత్యయత్నం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Students incident: అనంతపురంలో దారుణం..  విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం
Students incident

అనంతపురం, డిసెంబరు11(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లాలోని కేఎస్ఆర్ జూనియర్ కాలేజీలో నలుగురు బాలికలు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నలుగురు విద్యార్థినులు వాస్మోల్ తాగి ఆత్మహత్యయత్నం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నగరంలోని కేఎస్ఆర్ జూనియర్ కళాశాలలో తాడిపత్రి మండలానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు చదువుతున్నారు.


విద్యార్థినుల గురించి తల్లిదండ్రులకు వార్డెన్ వసంత ఫిర్యాదు చేశారు. దీంతో విద్యార్థినులు భయపడి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం గమనించిన వార్డెన్ వెంటనే వారిని చికిత్స నిమిత్తం అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం బాలికల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.


ఈ విషయం తెలుసుకుని ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు విద్యార్థినుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చేరుకున్నారు. బాలికల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అయితే, ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఈ ఘటనతో మిగతా విద్యార్థినులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గోల్డీ హైదర్‌తో మంత్రి లోకేశ్ కీలక భేటీ.. పెట్టుబడులపై చర్చ

ఇంద్రకీలాద్రిలో భవాని దీక్ష విరమణలు ప్రారంభం.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 11 , 2025 | 01:12 PM