Share News

AP News: అన్నం ఉడకలేదు.. కూరలు రుచిగా లేవు..

ABN , Publish Date - Dec 12 , 2025 | 01:49 PM

అన్నం ఉడకలేదు.. కూరలు అస్సలు బాగో లేవు.. అదే మీ పిలల్లకైతే ఇలాగే పెడతారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యురాలు గంజిమాల దేవి. కాలువపల్లి ఉన్నత పాఠశాలలోని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన ఏజెన్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP News: అన్నం ఉడకలేదు.. కూరలు రుచిగా లేవు..

- పిల్లలకు ఇంత దరిద్రంగా భోజనం పెడతారా

- మీ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు

- మధ్యాహ్న భోజనం ఏజెన్సీపై రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యురాలు గంజిమాలదేవి ఆగ్రహం

బెళుగుప్ప(అనంతపురం):‘ అన్నం సరిగా ఉడకలేదు .. కూరలు రుచే లేవు. గడ్డిలా పడేస్తే తింటారులే అనుకున్నారా.. మీ పిల్లలకు ఇలాంటి అన్నమే పెడతారా... మీ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. ’అంటూ రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యురాలు గంజిమాలదేవి మండలంలోని కాలువపల్లి(Kaluvapalli) ఉన్నత పాఠశాలలోని మధ్యాహ్న భోజన ఏజెన్సీపై మండిపడ్డారు. గురువారం ఆమె ఆ గ్రామంలో పర్యటించారు. రెండు ప్రభుత్వ చౌకధాన్యపు డిపోలు, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు.


రెండు డిపోలనూ సక్రమంగా నిర్వహించడం లేదని, వెంటనే కేసులు నమోదు చేయాలని తహసీల్దార్‌ అనిల్‌ కుమార్‌, డీటీ మధు సూదన్‌రావును ఆదేశించారు. అనంతరం ఆ గ్రామంలోని ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. వంటలు సరిగా లేవని ఏజెన్సీపై మండిపడ్డారు. ప్రభుత్వం మధ్యాహ్న భోజనం నాణ్యతతో కూడిన మెను అందించేందుకు చాలా డబ్బు వెచ్చిస్తోందని, ఎందుకు సక్రమంగా అమ లు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వెంట డిప్యూటీ డీఈఓ మల్లారెడ్డి, ఎంఈ వో హరికృష్ణ, హెచ్‌ఎం ఉషా రాణి, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ రమాదేవి, వీఆర్వో మధు ఉన్నారు.


zzzz.jpg

- రాయదుర్గంరూరల్‌ : పట్టణంలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలను, నిత్యావసర సరుకుల దుకాణాలను రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యురాలు గంజిమాలదేవి తనిఖీ చేశారు. అనంతరం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడుతూ.. పౌష్టిక ఆహారాల సరఫరాలో లోపాలు చోటు చేసుకుంటూ సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.స్టోర్‌డీలర్లు తూకాలు సరిగా వే యాలని, లేకుంటే చర్యలు తీసుకోవాలని సం బంధిత అధికారులకు ఆదేశించారు. ఆమె వెంట డిప్యూటీ డీఈఓ, స్టాక్‌పాయింట్‌ డీఎం రమే్‌షరె డ్డి, డీఎస్‌ వెంకటేశ్వర్లు, స్టాక్‌ పాయింట్‌ ఇన్‌ఛార్జ్‌ సుబ్రహ్మణ్యం, తహసీల్దార్‌ నా గరాజు, ఎంఈఓ మహమ్మద్‌ ఉన్నారు.


- డీలర్లకు గౌరవవేతనం ఇవ్వండి

స్టోర్‌ డీలర్లకు రూ. 7,500 గౌరవవేతనం అందించాలని స్టోర్‌ డీలర్ల సంఘం పట్టణ అధ్యక్షుడు దాసరి సత్తి, కార్యదర్శి వెంకటేశులు రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యురాలికి వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం డీలర్లకు క్వింటాల్‌కు రూ. 100 కమీషన్‌ ఇస్తున్నారని, దానిని రూ. 200 లకు పెంచాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..

విషాదం.. లోయలో పడిపోయిన ట్రావెల్ బస్సు..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 12 , 2025 | 01:49 PM